తుళ్లూరు: రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితికి గత ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కారణమని జనసేన నాయకులు, సీనీనటులు నాగబాబు ఆరోపించారు. ఆయన అమరావతికి గతంలోనే చట్టబద్దత కల్పించివుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాజధానిపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానని వ్యతిరేకంగా అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు చేపట్టిన నిరసనలకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మద్దతు తెలిపింది.  ఈ నిరసన కార్యక్రమాల్లో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు నాగబాబు,  ఇతర నాయకులు  శుక్రవారం పాల్గొన్నారు. అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా వారు పలు ప్రాంతాల్లో పర్యటించారు.
 
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలపై మండిపడ్డారు. అమరావతి విషయంలో గత టీడీపీ ప్రభుత్వం తప్పు  కూడా చాలా  ఉందన్నారు. అమరావతిచట్ట బద్ధత అనేది కల్పించకుండానే వారు వెళ్లిపోయారని... దీన్ని అదునుగా చేసుకునే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసిందన్నారు.

read more  రాజధాని వివాదం... తల తోక తీసేసి పార్టులు పార్టులుగా విడగొడతారా...: వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి

ఒకప్పుడు రైతుల జీవితాలలో చంద్రబాబు ఆడుకున్నారని....అందుకే ఆయనకు వారు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే మళ్లీ అదే తప్పు జగన్ కూడా చేస్తున్నారని... రైతుల జీవితాలతో ఆడుకుంటున్నవారు ఎవరికైనా తగిన శాస్తి జరుగుందని హెచ్చరించారు. 

రాష్ట్ర స్థాయిలో అన్యాయం జరిగితే కేంద్ర స్థాయిలో పోరాడదామని రైతులుకు నాగబాబు ధైర్యాన్ని నూరిపోశారు. కన్న బిడ్డని త్యాగం చేసినట్లు మీరు భూములు త్యాగం చేశారని... అలా భూముల ఇచ్చిన మీకు ఎండలో కూర్చునే కర్మ పట్టడం బాధాకరమన్నారు. 

వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయడం మరచి కొత్త వ్యవహారాలు నెరుపుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో జనాల వద్దకి తిరిగి బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టారే.... ఇప్పుడు ఈ జనం బాధ కనపడటం లేదా అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెయ్యండి... అలాగే రాజధాని ప్రజలకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి నాగబాబు సూచించారు. 

read more  జీఎన్ రావు కమిటీ సీఎంతో భేటీ: రాజధానిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్

రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన ఆలోచన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. కేవలం అమరావతిని మాత్రమే కాకుండా మరో రెండు నగరాలను కూడా రాజధానిగా ఏర్పాటుచేసి అభివృద్ది వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు జగన్ వెల్లడించాడు. అయితే అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు మాత్రం కేవలం తమ ప్రాంతంలోని రాజధాని వుండాలని... కావాలంటే మిగతామార్గాల్లో ఇతర పట్టణాలను అభివృద్ది చేయాలని సూచిస్తున్నారు.