Asianet News TeluguAsianet News Telugu

శారదాపీఠంలో జగన్ యాగాలు అందుకోసమే... ప్రజలకోసం కాదు..: పంచుమర్తి అనురాధ

విశాఖ శారదాపీఠంలో పరిపూర్ణానంద స్వామి  సమక్షంలో యాగాలు చేసినప్పటికి సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.

jagan would soon be jailed...: panchumarthi anuradha
Author
Amaravathi, First Published Feb 5, 2020, 7:57 PM IST

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం తెనాలిలో మీటింగ్ కు వెళ్లారని... అయితే మంగళగిరి నుంచి అక్కడికి వెళ్లడానికి ఆయనకు 6గంటల సమయం పట్టిందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి తెలిపారు. దీన్నిబట్టే రాజధాని కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ప్రజలు ఎంతలా మద్దతిస్తున్నారో అర్థమవుతుందన్నారు. టిడిపి పోరాటంలో నిజం ఉందని దీన్ని చూశాకయినా వైసీపీ నాయకులకు అర్ధం అవ్వటం లేదా..? అని ప్రశ్నించారు.

పాము తన పిల్లలను తానే చంపుకున్న విధంగా వైసీపీ నాయకులు కూడా వారి ప్రాంతపు ప్రజలను చంపుతున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులు, మహిళలు దాదాపు 50రోజుల నుంచి రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తుంటే అమరావతి పరిధిలోని ఎమ్మెల్యేలు, సీఎం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అసలు జగన్ కు పరిపాలన గురించి తెలుసా? లేదా వీడియో గేమ్స్, పబ్జీ గేమ్స్ అడుకోవడమే తెలుసా? అని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం కొంతమంది పెయిడ్ అర్టిస్టులను రాజధాని రైతులంటూ జగన్ తో సమావేశపర్చారని... వారంతా  ఆయన బంధువులు, వైసిపి నాయకులేనని అనురాధ పేర్కొన్నారు. 

58రోజులల్లో 33వేల ఎకరాలు 29 గ్రామాలల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం జరిగిందని  గుర్తుచేశారు. రైతులు కూడా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో తమ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. 29 గ్రామాలల్లో ల్యాండ్ పూలింగ్ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 23 గ్రామాలతో పాటు నిడమర్రు, పెనమాక, ఉండవల్లిని కూడా చేర్చాలని వైసీపీ నాయకులు కోరారని... ఇప్పడు అదే గ్రామాల ప్రజలు తీసుకొని వచ్చి రాజధానికి వ్యతిరేకమని చూపిస్తున్నారని అనురాధ తెలిపారు. 

Video: చంద్రబాబుకు మంగళహారతులు పట్టిన అమరావతి

అసెంబ్లీ సాక్షిగా తమ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. రాజధాని ప్రాంతంలో రామకృష్ణా రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలు తొమ్మిది ఉన్నాయని.... వాటిలో 2019 ఎన్నికలల్లో 4వేల ఓట్లు మైనస్ అయ్యాయి ఆ విషయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి గమనించుకోవాలన్నారు. 

ఉండవల్లి శ్రీదేవి ఎవరి విగ్రహనికి పూలమాల వేశారో తెలియని పరిస్థితిలో ఉందన్నారు.  శ్రీదేవికి 50శాతం మహిళలు ఓట్లు వేస్తేనే గెలిచారని... అలాంటిది ఇవాళ  మహిళ రైతులు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోపోవడం దారుణమన్నారు. 

రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతుంటే అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్ కు ఉందా? అని నిలదీశారు. స్వరూపానంద స్వామి యాగం చేశారని సీఎం మూడు గంటలు సమయం కేటాయించారని... అదే రాజధాని రైతులు 50రోజుల్లో దాదాపు 42 మంది రైతులు చనిపోతే కనీసం సానుభూతి ప్రకటించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. 

రాజశ్యామల యాగాలు, చండీయాగం, నవగ్రహ పూజలు, ప్రజచంగర యాగాలు చేసినా నిజమనేది ఒక్కటి ఉంటుందని...దేవుడు అనేవాడు దండం పెట్టిన పెట్టకపోయినా నీతినిజాయితీలు నిజంతో ఒక పద్దతి ప్రకారం బ్రతికే వారికి ఎప్పడు పక్కనే ఉంటాడన్నారు. ఒక ముద్దాయి తరుపున యాగాలు, హోమాలు చేస్తే అవి అక్కరకు వస్తాయా?
 అని స్వామీజీని నిలదీశారు.

గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ, అవినీతి సంపాదనతో  మైనింగ్ ద్వారా వచ్చిన సంపాదనతో వెంకటేశ్వర స్వామికి డైమండ్, వజ్రాలు కిరీటాలు సమర్పించినా రక్షించలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను, కులాలను, సాంప్రదాయాలను గౌరవిస్తోందని... ఒక వ్యక్తి ఫండ్స్ కోసం రెడ్డి అని,  ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, చెప్పుకుంటారు, కేసులు మాఫీ కోసం ఆర్‌ఎస్ఎస్ మెప్పు కోసం హోమాలు, యాగాలు చేస్తారంటూ జగన్ పై విరుచుకుపడ్డారు.

read more  రాజధాని మహిళలను గోళ్లతో రక్కి, గిచ్చి...పోలీసుల కర్కశత్వం...: వర్ల రామయ్య

తిరుపతి తిరుమల దేవాలయంలో దేవుడికి భార్య, భర్తలు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు? కానీ ఆ సంప్రాదాయాలకు జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. నిన్న జరిగిన యాగంలో కూడా భార్య ఎక్కడ కనిపించలేదన్నారు. స్వరూపానంద స్వామి లాగా దేవుడిని కొలవకపోయినా తమకు కూడా కొంత భక్తి ఉందని... రాముడంత వారు కూడా అశ్వమేధాయాగం చేసేటపుడు భార్య పక్కన ఉండాలని ఫురోహితులు చెప్పితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సీతమ్మ ప్రతిబింబంను తయారు చేయించి పక్కన పెట్టుకొని యాగం చేశారని గుర్తుచేశారు. ఇలాంటి విషయాలపై స్వామిజీ అలోచాలన్నారు.

సంప్రాదాయాలు అంటే తెలియని వ్యక్తి, గౌరవం లేని వ్యక్తి , మతాలను, కులాలను తన అవసరాలకు అనుగుణంగా పుట్ బాల్ అడే వ్యక్తికి ఆయన సానుకూలంగా వ్యవహరిస్తున్నారని... ప్రజలు ఇది గమనిస్తున్నారని స్వామిజీ తెలుసుకొవాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ప్రతి మత గ్రంధాలలో ఉంటుందని... మరి ఇచ్చిన మాట తప్పి కళ్లు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios