Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ తన మంచి మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురయిన క్షతగాత్రులను దగ్గరుండి కాపాడి మావత్వాన్ని చాటుకున్నారు.  

chilakaluripet mla vidadala rajani shows humanity
Author
Chilakaluripet, First Published Dec 25, 2019, 8:03 PM IST

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మానవత్వాన్ని చాటుకున్నారు.  రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలైన ఓ కుటుంబాన్ని స్వయంగా దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు.  ఇలా క్రిస్మస్ పండగ పూట ఆపదలో వున్నవారిని ఆదుకున్నారు ఎమ్మెల్యే విడదల రజని. 

chilakaluripet mla vidadala rajani shows humanity

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురం శివారులో ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యం  16వ నంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు రూర‌ల్ మండ‌లం కోండ్రుపాడుకు చెందిన నాగ‌రాజు భార్య య‌శోదతో పాటు కూతురు, కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

read more  రాజధానిపై ప్రభుత్వ ప్రకటన ఇప్పుడే ఎందుకంటే...: వర్ల రామయ్య

క్రిస్‌మ‌స్ ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల‌ల కోసమని ఈ కుటుంబ‌ం తిమ్మాపురం గ్రామానికి బ‌య‌లుదేరారు. అయితే మార్గ మ‌ధ్య‌లో బైక్ అదుపుతప్పి మితిమీరిన వేగంతో వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో నాగరాజు అతడి కుమారుడు తీవ్రగా గాయపడతా భార్య, కూతురికి  తీవ్ర గాయాలయ్యాయి. 

chilakaluripet mla vidadala rajani shows humanity

ఇదే సమయంలో చిలకలూరిపేట వైపు వెళుతున్న ఎమ్మెల్యే రజని రక్తపుమడుగులో పడివున్న క్షతగాత్రులను గమనించారు. వెంటనే తన కారు ఆపి అనుచరులు, గ్రామస్థుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రి సూప‌రింటెండెంట్ కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. 

read more  అలా చేస్తే జగన్‌ మరోసారి జైలుకే: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

 ప్రస్తుతం న‌లుగురు క్ష‌తగాత్రుల్లో ఇద్దరు సుర‌క్షితంగానే ఉన్నార‌ని... నాగ‌రాజు మెద‌డుకు స‌ర్జ‌రీ చేస్తున్నామ‌ని డాక్టర్లు తెలిపారు. కుమారుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని  తెలిపారు. య‌శోద‌ చిన్న చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డగా కుమార్తెకు ఎలాంటి గాయాలు లేవ‌ని సూప‌రింటెండెంట్ మీడియాకు తెలిపారు.  

chilakaluripet mla vidadala rajani shows humanity

Follow Us:
Download App:
  • android
  • ios