వివాహ వ్యవస్థకే జగన్ దంపతులు కలంకం... శివరాత్రి రోజే...: అనిత వ్యాఖ్యలు
భార్యభర్తల అన్యోన్యానికి ప్రతీకగా నిలిచే శివపార్వతులను ఎంతో పవిత్రంగా పూజించే శివరాత్రి రోజే సీఎం జగన్ తన భార్య భారతి పేరిట అక్రమాలకు ఎలా పాల్పడ్డాడో తెలిపే వార్త చూడాల్సి వస్తుంది అని అనుకోలేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు.
గుంటూరు: ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిలపై ఆంధ్ర ప్రదేశ్ టిడిపి మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. తన పేరుమీదే కాదు భార్యపేరుమీద కూడా జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో ఒకటే భారతి సిమెంట్ వ్యవహారమని... అక్రమ మార్గంలో భారీ డబ్బులు ఈ సంస్ధకు పెట్టుబడుల రూపంలో వచ్చాయన్నారు.
''శివ,పార్వతుల అన్యోన్యత వివాహ వ్యవస్థ కి ఉన్న గొప్పతనానికి నిదర్శనం అలాంటి శివరాత్రి రోజున ఇలాంటి వార్త చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు.భార్య ని దైవంగా భావించే మన దేశంలో భార్య పేరుతో జగన్ గారు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించి వివాహ వ్యవస్థ కే కలంకం తీసుకొచ్చేలా చేసారు.''
read more ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం: తెర మీదికి అచ్చెన్నాయుడు పేరు
''క్విడ్ ప్రో కో ద్వారా భార్య పేరుతో ఉన్న భారతి సిమెంట్స్ లో రూ.96 కోట్లు అక్రమ పెట్టుబడులు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టారు.మరో 40 కోట్లు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టారు.అధిక ప్రీమియం కి ఈ షేర్లని కొన్నారు. అందుకే అవి దొంగ పేపర్,ఛానల్ అయ్యాయి.''
''క్విడ్ ప్రో కో లో భాగంగా జగన్ గారు ఇండియా సిమెంట్స్ కి చెందిన మైన్ లీజులు పొడిగించారు అని ఈడీ హై కోర్టు లో వాదనలు వినిపించింది.ఇన్ని అక్రమాలు చేసి, భార్య పేరు మీద కూడా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి సాక్షులను బెదిరించలేరా?''అంటూ వరుస ట్వీట్లలో భారతి సిమెంట్ పేరిట అక్రమాల గురించి అనిత వివరించారు.