అనంతపురం లోని సోమనాథ్ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని స్వప్న కు వైద్యులు బోన్ క్యాన్సర్ సోకిందని, వ్యాధి నయం చేయడానికి షుమారు 6 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో స్వప్న కుటుంభం హతాశులైనారు.  కుటుంభ పెద్ద అయిన తండ్రి లారీ డ్రైవర్ గా సంపాదించేది కుటుంభ కనీస అవసరాలకే సరిపోని పరిస్థితులలో 6 రూపాయలు ఎక్కడ నుండి తేవాలో తెలియక కూతురును తల్లితండ్రులు ఇంటిలోని ఉంచి సహాయం కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలకై వెదులాట ప్రారంభించడం....అదే సమయంలో స్వప్నకు అండగా తోటి విద్యార్థులు సమస్యను శ్రీ నందమూరి బాలకృష్ణ దృష్టికి బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం ద్వారా తీసుకొని వచ్చి సహాయాన్ని అర్థించడం జరిగింది. 
 
విషయాన్ని తెలుసుకొన్న తర్వాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ స్వప్న స్నేహితుల ద్వారా వారి కుటుంభ సభ్యులను హాస్పిటల్ కు రప్పించి వారితో ముప్పైకి పైగా నిమిషములు మాట్లాడి వివరాలను తెలుసుకొన్నారు.  స్వప్న తో పాటూ వారి తల్లితండ్రులకు ధైర్మం చెప్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ మరియు ఆంద్ర ప్రదేశ్ లోని హిందుపురం శాసనసభ్యులు బాలకృష్ణ సదరు యువతికి చికిత్స వెంటనే అందించాలని హాస్పిటల్ యాజమాన్యం వైద్యులను ఆదేశించారు.  

read more అలా వుండాలి.... కేవలం నావల్లే ఇసుక మాఫియాకు చెక్..: చంద్రబాబు

వెను వెంటనే స్వప్నను హాస్పిటల్ లో అడ్మిట్ చేయించి నేడు స్వప్నను స్వయంగా పరామర్శించి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్యులకు, యాజమాన్యానికి తగిన సూచనలు జారీ చేశారు.  అందుకనుగుణంగా ఆసుపత్రి వైద్యులు త్వరలోనే చికిత్స ప్రారంభించి, అందులో భాగంగా అవసరమైన శస్త్ర చికిత్సతో పాటూ ఇతర సంబంధిత వైద్యాన్ని ఉచితంగా అందించనున్నారు.  ఇందులో భాగంగా ఇప్పటికే స్వప్నను హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని చికిత్సను ప్రారంభించం జరిగింది.
 
బాలకృష్ణ తీసుకొని ఈ చొరవతో జీవితంపై ఆశలు వదులుకున్న స్వప్న ఆనందోత్సహాలకు లోనైంది.  ఈ సందర్భంగా శ్రీ బాలకృష్ణకు స్వప్న, ఆమె తల్లితండ్రలు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ సందర్బంగా శ్రీ బాలకృష్ణ మాట్లాడుతూ స్వప్నకు అవసరమైన పూర్తి చికిత్సకయ్యే ఖర్చు కు సంబంధించి అవవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే స్వప్న తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలై అందరు విద్యార్థులలాగానే ఉన్నత చదువులు చదువుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

read more  రివర్స్ డిమాండ్: భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛను ఇవ్వండి
 
ఇలా కష్టాలు కన్నీరు తెప్పిస్తున్న తరుణంలో నేనున్నానంటూ  బాలకృష్ణ ముందుకు రావడం పట్ల స్వప్న కుటుంభం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.  బాలకృష్ణ గారి ఈ చర్యతో లారీ డ్రైవర్ కుటుంభంలో కొత్త ఆనందం రావడమే కాకుండా తమ బిడ్డ మళ్లీ బ్రతుకుతుందనే ఆశ వారిలో చిగురించింది.  దీనిపై వారు బాలకృష్ణతో పాటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.