రాజధాని సెగ: ఆగిన మరో రైతు గుండె.. ఒకే రోజు ఇద్దరి మరణం, అమరావతిలో విషాదం

రాజధాని ఆందోళనలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన పాలకాయల మాధవ అనే 60 ఏళ్ల రైతు బుధవారం గుండెపోటుతో మరణించాడు.

capital protest: farmer died due to heart attack in amaravathi

రాజధాని ఆందోళనలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన పాలకాయల మాధవ అనే 60 ఏళ్ల రైతు బుధవారం గుండెపోటుతో మరణించాడు.

ల్యాండ్‌పూలింగ్ విధానంలో ఆయన రాజధానికి అర ఎకరం పొలం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన గత కొన్నిరోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నాడు.

Also Read:జగన్ నీ రేటెంతో చెప్పు.. సీఎంకి మహిళా రైతు సవాల్

ఇటీవల తీవ్ర మనస్తాపానికి గురైన మాధవ మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బుధవారం గుండెపోటుకు లోనై మరణించారు. దీంతో ఐనవోలులో విషాద వాతావరణం నెలకొంది. 

రాజధాని ప్రాంతం  కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు  అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు.

Also Read:సచివాలయానికి జగన్... వారికి ఆంక్షలు.. భోజనం కూడా చేయనివ్వకుండా

సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన  తనకున్న  0.50 సెంట్ల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున  గుండెపోటు వచ్చింది.

వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. రాజధాని రైతు మరణించాడనే వార్త తెలియడంతో  గ్రామ ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios