Asianet News TeluguAsianet News Telugu

జగన్ నీ రేటెంతో చెప్పు.. సీఎంకి మహిళా రైతు సవాల్

రాజధాని రైతాంగ మహిళలు మంగళవారం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత సీఎం జగన్ కి గట్టి సవాల్ విసిరారు. తాము పెయిడ్ ఆర్టిస్టులమైతే సీఎం జగన్ వచ్చి తమతోపాటు పోరాటంలో కూర్చోవాలని మందడానికి చెందిన ఓ మహిళా రైతు సవాల్ చేశారు.

woman farmer challenge to CM YS Jagan
Author
Hyderabad, First Published Jan 8, 2020, 12:26 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.... రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరిట ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే... ఈ ఉద్యమంలో పాల్గొనేవారంతా రైతులు కాదని.. పెయిడ్ ఆర్టిస్ట్ లని కొందరు.. టీడీపీ కార్యకర్తలు అంటూ వైసీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు.

కాగా... తమను పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ అధికార పార్టీ చేస్తున్న విమర్శలపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని ఉద్యమంలో పాల్గొన్నందుకు వైసీపీ కార్యకర్తతలకు వెయ్యి రూపాయలు చెల్లించారంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు.

రాజధాని రైతాంగ మహిళలు మంగళవారం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత సీఎం జగన్ కి గట్టి సవాల్ విసిరారు. తాము పెయిడ్ ఆర్టిస్టులమైతే సీఎం జగన్ వచ్చి తమతోపాటు పోరాటంలో కూర్చోవాలని మందడానికి చెందిన ఓ మహిళా రైతు సవాల్ చేశారు.

AlsoRead సచివాలయానికి జగన్... వారికి ఆంక్షలు.. భోజనం కూడా చేయనివ్వకుండా...

‘‘మేం పెయిడ్‌ ఆర్టిస్టులమా? వైసీసీ కార్యకర్తలు వచ్చి అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపితే వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారని అంటున్నారు. వైసీపీ కార్యకర్త వెయ్యి రూపాయలకు అమ్ముడుపోతే....జగ న్మోహన్‌రెడ్డిగారు మీకొక రేటు ఉంటుంది కదా! ఆ రేటేదో చెప్పండి. మా ఆస్తులు అమ్ముతాం. మా తాళిబొట్లు, మెట్టెలు అమ్ముతాం. అవసరమయితే మా ప్రాణాలు అమ్మేసయినా సరే.. మిమ్మల్ని కొంటాం. మా అమరావతిని ఇక్కడే పెట్టుకుంటాం’’ అంటూ ఓ మహిళా రైతు పేర్కొనడం గమనార్హం.

‘‘సీఎం...మీరు ప్రజల మంత్రే కదా! అమరావతిలోని 29 గ్రామాల్లో అసలు ఎవడికీ బాధలేదని అంటున్నారు కదా! మాకు బాధలేనప్పుడు, మీరొచ్చేటప్పుడు 144 సెక్షన్‌ ఎందుకు పెట్టుకుంటున్నారు? సచివాలయంలో మీరు కూర్చునేంతసేపు కర్ఫ్యూలు ఎందుకు పెడుతున్నారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios