సచివాలయానికి జగన్... వారికి ఆంక్షలు.. భోజనం కూడా చేయనివ్వకుండా
ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీఎం జగన్... సెక్రటేరియట్ కి వెళ్తున్న నేపథ్యంలో మందడం ప్రధాన రహదారిని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. జగన్ వచ్చి వెళ్లే వరకు షాపులు తెరుచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లిన ప్రతిసారి మందడంలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సీఎం సచివాలయానికి వెళ్లిన ప్రతిసారి మందడంలో పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నారు. కనీసం రోడ్లపై కూడా తిరగనివ్వడం లేదు. ఈ విషయంపై ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీఎం జగన్... సెక్రటేరియట్ కి వెళ్తున్న నేపథ్యంలో మందడం ప్రధాన రహదారిని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. జగన్ వచ్చి వెళ్లే వరకు షాపులు తెరుచుకోలేదు.
AlsoRead రాజధాని రచ్చ: సమావేశమైన హై పవర్ కమిటీ...
ఇక్కడి ప్రధాన రహదారిలో మూడంచెల బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఐడీకార్డ్, ఆధార్ కార్డు తనిఖీ చేశాక సచివాలయంలో పంపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రధాన రహదారి వెంట ఉన్న దుకాణాలు పూర్తిగా మూసివేయిస్తున్నారని.. దాని వల్ల తమకు ఇబ్బంది ఎదురౌతోందని చెబుతున్నారు. మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారన్నారు.
ఇక్కడి లింక్ రోడ్డులో ఇనుప కంచె, బారికేడ్లు ఏర్పాటు చేసి గ్రామస్థులు ఎవరినీ ఆ రోడ్డులోకి రానివ్వకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బయట అరుగుల మీద కూడా కూర్చోనివ్వడం లేదని వారు తెలిపారు. సీఎం సచివాలయానికి వెళ్లిన తర్వాతే భోజనాలు చేయమని చెబుతున్నారని వాపోతున్నారు.