వైఎస్ వివేకా హత్యపై అనుమానాలు... జగన్ ను నిలదీస్తూ కన్నా లేఖ

మాాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు.  

BJP President Kanna Lakshmi Narayana Write Letter to CM jagan

అమరావతి: మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకే అతీ గతి లేకుండా పోయిందని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆయన  హత్యపై ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తాయని... వాటిని  నివృత్తి  చేసి ఈ దారుణానికి పాల్పడిన నిందితులను ప్రభుత్వం కఠినంగా  శిక్షించాలని డిమాండ్  చేశారు. 

ఈ  మేరకు వైఎస్ వివేకా హత్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కన్నా లేఖ రాశారు. ఈ లేఖలో మాజీ మంత్రి వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడాన్ని ప్రశ్నించారు. మార్చి నెలలో హత్య జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని జగన్ ను ప్రశ్నించారు కన్నా.

దీన్నిబట్టే రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని అర్థమవుతోంది కాబట్టి వెంటనే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిందితులు ఎవరన్నది బయటడుతుందని... లేదంటే ఎప్పటికీ ఈ కేసు పరిస్థితి ఇలాగే వుంటుందని కన్నా పేర్కొన్నారు. 

read more వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు టీడీపీ ఎమ్మెల్సీ, ఏమన్నారంటే...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి, టిడిపి నాయకులు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిఇటీవలే సిట్ ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. 

మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఎందుకు విచారణకు పిలిచారో అర్థం కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైయస్ వివేకా హత్యపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో తనను విచారణకు పిలిచారని తెలిపారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సిట్ బృందం తనకు నోటీసులు ఇవ్వడంతోనే కడపకు వచ్చినట్లు తెలిపారు బీటెక్ రవి. 

బీటెక్ రవితోపాటు మరొకరు పరమేశ్వర్ రెడ్డి కూడా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీటెక్ రవితోపాటు పరమేశ్వర్ రెడ్డికి కూడా సిట్ దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

read more దిశ నిందితుల ఎన్‌కౌంటర్, అయినా మారని మృగాళ్ళు... మైనర్ బాలికపై యువకుల అత్యాచారం

కడప జిల్లాలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఇకపోతే బుధవారం వైయస్ వివేకానందరెడ్డి డ్రైవర్లను సిట్ బృందం విచారించింది. వారి వివరాల ప్రకారం బీటెక్ రవిని విచారణకు పిలిచినట్లు సమాచారం. 

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది సిట్ దర్యాప్తు బృందం. నాలుగు నెలలుగా జరుగుతున్న సిట్ బృందం విచారణ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మరో వారం రోజులపాటు విచారించి అనంతరం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.  

 ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. ఇకపోతే బుధవారం కూడా మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్ లు దస్తగిరి, ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ బృందం విచారించింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios