సొంతజిల్లా అభివృద్దికై... ఇరిగేషన్, పరిశ్రమల శాఖ మంత్రుల భేటీ

సొంత జిల్లా నెల్లూరు అబివృద్దిపై చర్చించేందుకు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై వారిద్దరు చర్చించారు.  

ap irrigation minister anil kumar yadav,  industrial minister mekapati goutham reddy meeting on nellore development

అమరావతి; ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ , జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 పనులను వెంటనే పూర్తిచేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఎకరాకు నీరందించే విధంగా తీర్చిదిద్దిన డాక్యుమెంట్ ఫైల్ ను మంత్రి అనిల్ కు గౌతమ్ రెడ్డి  అందించారు. 

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో తీవ్ర వర్షాభావం ఉండే మెట్టప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల కలను సాకారం చేసే ప్రక్రియలో మంత్రి మేకపాటి వేగం పెంచారు. బుధవారం ఉదయం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో   మంత్రి మేకపాటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

read more చంద్రబాబు ఓ రాజకీయ దళారి... లోకేష్ డైటింగ్ కోసమే...: చీఫ్ విప్ గడికోట

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవచూపాలని మంత్రి మేకపాటి కోరారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఎకరాకు నీరందేలా ఫేజ్-2 పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంపై సహకరించాలన్నారు. 

టెండర్లను పిలిచి పనులు పరుగులు పెట్టించి రాబోయే సాగు సమయానికి నీరందించేలా చేయాలని కోరారు. అందుకోసం రూపొందించిన  పూర్తి వివరాలను డాక్యుమెంట్ రూపంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి అందించారు. 

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని సుమారు 100 గ్రామాల రైతాంగానికి వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగు నీరు అందించేందుకు చొరవచూపాలని మంత్రి అనిల్ ను మేకపాటి కోరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

read more ఇంటిదొంగ పనే... ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో నిందితుడు అరెస్ట్

 సోమశిల రిజర్వాయర్ ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సమీపంలోనే ఉన్నా కాలువలు లేక నీరు అందక అక్కడి రైతాంగం పడుతున్న ఇబ్బందులను మరోమూరు సంబంధిత శాఖ మంత్రికి వివరించారు. గత ఐదారేళ్లలో వర్షం లేక, కాలువల్లో నీరు కరవై పొట్టకూటి కోసం వలస వెళుతున్న పల్లె ప్రజల అవస్థలను తీర్చేందుకు సహకరించాలని కోరారు. 

తానూ నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రిగా సోమశిల ప్రాజెక్టు పనుల పూర్తిలో తన భాగస్వామ్యం, సహకారం సంపూర్ణంగా అందిస్తానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios