చంద్రబాబు ఓ రాజకీయ దళారి... లోకేష్ డైటింగ్ కోసమే...: చీఫ్ విప్ గడికోట
ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనే కారణమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుకనంతా దోచుకున్నది టిడిపి పార్టీ నాయకేలేనని ఆయన పేర్కొన్నారు.
తాడేపల్లి: గత ఐదేళ్ల పాలనలో ఇసుకను అందినకాడికి దోచుకున్నారని...అందువల్లే ప్రస్తుతం ఇసుక సమస్య ఏర్పడినట్లు ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇసుక సమస్యపై విలేకరులతో మాట్లాడారు.
ఇసుక కొరతను పారదోలేందుకు అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి జగన్ ఇసుకపాలసీ తీసుకువచ్చారన్నారు. ఇసుకపై చంద్రబాబుకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా అసత్యప్రచారం చేస్తోందన్నారు.వరదలవల్ల ఇసుక కొరత కొంత ఉన్నమాట వాస్తవమేనని అన్నారు.
లోకేష్ ఇసుక దీక్ష డైటింగ్ కోసం చేస్తున్నట్లుగా ఉందన్నారు. గతంలో టిడిపి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో జరిపిన దీక్ష సమయంలో మాట్లాడుతూ... రాష్ర్ట ప్రయోజనాలు ఏమీలేవు, దీక్షలు ఒళ్లు తగ్గించుకోడానికి చేయాల్సిందే అంటూ నవ్వులాటలుగా మాట్లాడటాన్ని ప్రజలు మరిచిపోలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు.
read more ఇంటిదొంగ పనే... ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో నిందితుడు అరెస్ట్
భవన నిర్మాణకార్మికులకు మీరు చేసిన మోసం తెలిస్తే కార్మికులు చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను తరిమికొడతారన్నారు.భవన నిర్మాణకార్మికులకు పదివేల కోట్లు వచ్చే అవకాశం ఉంటే రానీయకుండా కమీషన్ల కోసం దోచుకున్నారని ఆరోపించారు.
వేసవిలో హేరిటేజ్ కోసం చలవేంద్రాలు పెట్టి భవననిర్మాణకార్మికుల సెస్ 30 కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. అలాగే మేడేరోజు చంద్రబాబు ప్రచారం ఫ్లెక్సీల కోసం 50 కోట్ల రూపాయలకు వాడుకున్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో భవననిర్మాణ కార్మికులు దరఖాస్తులను పక్కనపెట్టి నిధులను పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో నిధులు వందలకోట్లు పక్కదారి పట్టించారని...భవన నిర్మాణ కార్మికుల సెస్ కు సంబంధించి వందలకోట్ల నిధులు పక్కదారి పట్టించడంపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సే మా ప్రభుత్వం ఆశయమన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు పట్టించుకోవద్దని... కూలీలు,కార్మికులకు భరోసా ఇస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికుల అభివృద్ది కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాలలో లేకుండా ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఆయన పాలనలో తెలుగుతమ్ముళ్లు గ్రామాలలో ఉన్న వాగులు, వంకలు, కాలువలు ఇలా అన్నింటిలో ఇసుక మట్టి దోచుకున్నది వాస్తవం కాదా... అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ రాజకీయదళారి అని ఘాటుగా విమర్శించారు.
read more దాచేపల్లి అత్యాచార ఘటన... వైసిపి ప్రభుత్వ కుట్రలివే...:పంచుమర్తి అనురాధ
రాష్ట్రవిభజనకు చంద్రబాబే కారకుడన్నారు. చంద్రబాబు నివాసం పక్కనే అప్పటి ఎంఎల్ఏ ధూళిపాళ్ల నరేంద్ర ఇసుక మాఫియాకు పాల్పడింది నీ కళ్లకు కనపడలేదా...అని ప్రశ్నించారు. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ దృష్టికి వెళ్తే వారు వందకోట్లు రూపాయలు జరిమానా విధించింది మరిచిపోయావా అని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ను వాడు వీడు అంటూ సంభోదిస్తూ నీ కుసంస్కారాన్ని చాటుకుంటున్నావని బాబుపై ఫైర్ అయ్యారు. జగన్ మంచి పారదర్శకపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు.
ఇసుక కొరత నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని...చిత్తశుద్ది ఉంటే అక్కడ తప్పులు ఉంటే తెలియచేయాలని సూచించారు. ఇసుక కొరత విషయంలో జగన్ అదికారులకు అందరికి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని...ఇసుక సులభంగా అందేలా చేయాలన్నారని వెల్లడించారు. అవినీతికి తావుండకూడదని సూచించినట్లు తెలిపారు.
రాష్ట్రవనరులు కాపాడాలనే ఉధ్దేశ్యంతో జగన్ ఉన్నారని...ముఖ్యమంత్రి వీడియోగేమ్స్ ఆడుకుంటున్నారంటూ మాట్లాడతా? అని చంద్రబాబుపై ద్వజమెత్తారు. చంద్రబాబు తన అనుభవానికి తగ్గట్లుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నారని....ఇకపై సీఎంను వాడు వీడు అని మాట్లాడితే ఊరుకునేదిలేదు, తగిన విధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు.