ఇంటిదొంగ పనే... ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో నిందితుడు అరెస్ట్
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆంధ్రా బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి ఇంటిదొంగేనని తెలిసి పోలీసులే కాదు బ్యాంకు సిబ్బంది కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.
చిత్తూరు జిల్లాలో సంచలనం రెకెత్తించిన ఆంధ్రా బ్యాంకు చోరీ కేసును పోలీసులు చేదించారు. అదే బ్యాంకులో పని చేసే అప్రైజరే ఈ దోపిడికీ పాల్పడినట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అతని వద్దనుంచి 11 కేజీల బంగారంతో పాటు 7 కేజీల నకిలీ బంగారం, 2 లక్షల 66 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్14వ తేదీన
చిత్తూరు జిల్లా యాదమరిలోని ఆంధ్రాబ్యాంక్ 18కెజీల బంగారం, 2.60లక్షల నగదు చోరీ జరిగింది. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా దొంగతనం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరును చూసిన పోలీసుకు ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు.ఆమేరకు బ్రాంచిలో పని చేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు.
read more దాచేపల్లి అత్యాచార ఘటన... వైసిపి ప్రభుత్వ కుట్రలివే...:పంచుమర్తి అనూరాధ
బ్యాంకు మేనేజర్ నుంచి క్యాషియర్ వరకు పోలీసులు విచారించారు.అయితే అక్కడే అప్రైజర్ గా పని చేస్తున్న విగ్రహాల రమేష్ ఆచారి మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా రోజూ వచ్చి వెళ్తున్నాడు. పోలీసుల దృష్టి అతనిపై పడింది. అతనిపై నిఘా పెట్టారు. ఇంకేముంది ఇతగాడి దొంగతనం బాగోతం బట్టబయలైంది.
ఈ నగల దొంగతనంతో పాటు తీగ కాగితే డొంకంతా కదిలినట్లు ఇతను బ్యాంకులో అప్రైజర్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని గిల్టు నగలతో నకిలీ ఖాతాదారులతో రుణం మాటున కొట్టేసిన కోటి ముప్పై లక్షల అక్రమ బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. కేసును చేధించిన పోలీసులు ఒరిజినల్ నగలు, గిల్టునగలతో పాటు దొంగిలించిన నగదును కూడా స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు.
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ కథనం ప్రకారం ఈ అప్రైజర్ నేలల తరబడి పథకం రచించి దొంగతనానికి పాల్పడ్డాడు. పలుమార్లు విఫలమైనా వదలకుండా దొంగతనం చేశాడు. పక్కా స్కెచ్ వేశాడు. సిసి కెమెరా రికార్డులు లేకుండా చేశాడు. అయినాచివరకు ఇలా దొరికిపోయాడు.
read more video: మేక్ ఎ విష్... రాచకొండ కమీషనర్‌గా 17 ఏళ్ల బాలిక
బ్యాంక్ అప్రైజర్ గా పని చేసే రమేష్ అచారి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం హాబీ. ఇలా తను సంపాయించిన సొమ్ములంతా షేర్ మార్కెట్లో పొగొట్టాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. అంతా పోగొట్టుకున్నాడు. దీంతో ఏదోవిధంగా డబ్బులు సంపాయించాలని డిసైడయ్యాడు. తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేయడానికి పన్నాగం పన్నాడు.
అందులో భాగంగా అంతా తానై కొంతమంది సన్నిహితుల ద్వారా నకిలీ ఖాతాలు సృష్టించి గిల్టునగలను బ్యాంకులో తనఖాలు పెట్టించాడు. తానే అప్రైజర్ కావడంతో అది ఒరిజినల్ నగలేనని బ్యాంకును నమ్మించాడు. ఇలా కోటి ముప్పై లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. వాటిని కూడా షేర్లలో పెట్టుబడి పెడ్టాడు. అక్కడా చుక్కెదురైంది.
ఉన్నదంతా ఊడ్చుకున్నాక ఇక వాటన్నింటినీ ఎలా రికవరీ చేయాలో తెలియక బ్యాంకు రాబరీ స్కెచ్ వేశాడు. ఈ నెలాఖరులో బ్యాంకులో తనిఖీ ఉందని తెలుసుకున్నాడు. ఎక్కడ తన నకిలీ బంగారు గుట్టు రట్టవుతుందోనని భయపడి దొంగతనం స్కెచ్ వేశాడు. అధికారులతో నమ్మకంగా ఉంటూ వారికి తెలియకుండా బ్యాంకు బీగాలు, లాకర్ బీగాలను నకిలీవి తయారు చేసుకున్నాడు. రెండు రోజులు సెలవు కావడంతో దర్జాగా దొంగతనం చేసుకున్నాడు.
read more చిత్తూరు : ఆంధ్రా బ్యాంక్‌లో భారీ చోరీ, మొత్తం విలువ రూ.3.50 కోట్లు
ఒరిజినల్ బంగారు నగలను కరిగించి ముద్దలుగా చేసుకుని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తాను బ్యాంకులో పెట్టించిన నకిలీ బంగారు నగలను పక్కనే ఉన్న మురికి కాలువలో పడేశాడు. కాలువలో కొట్టుకొచ్చిన నగలు గిల్టునలగలని తెకియక మోర్థాన పల్లెలో కొందరు వాటిని తెచ్చుకుని దాచుకున్నారు. పక పక్క తన పథకాన్ని అమలు చేస్తూ ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నాడు.
బ్యాంకు మేనేజర్, క్యారియర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నా రమేష్ ఆచారి మాత్రం యథాతథంగా పోలీస్ స్టేషన్ కు, బ్యాంకుకు తిరుగుతున్నాడు. పోలీసులు అప్రైజర్ పై దృష్టి సారించారు. అతని కదలికలపై నిఘా పెట్టారు. దీంతో పోలీసులకు రమేష్ పై అనుమానం కలిగింది. ఇంటి దొంగ గుట్టు రట్టయ్యింది.
read more ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ (వీడియో)
తాను కరిగించిన బంగారు ముద్దలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రమేష్ ను పోలీసులు పట్టుకున్నారు. అప్రైజార్ విగ్రహాల రమేష్ ఆచారిని అరెస్టు చేసి బంగారు నగలు, గిల్టు నగలుతో పాటు బ్యాంకులో దొంగిలించిన నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు.