2020 వాయిదాలతో షురూ...ఏపిలో ఆ సేవల ప్రారంభం వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ లో 2020 జనవరి 1వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన గ్రామ, వార్డు సచివాలయ సేవలు వాయిదా వేస్తున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది.   

ap government postponed grama, ward sachivalayam services

అమరావతి: జనవరి 1 తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన గ్రామ, వార్డు సచివలయాల సేవలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ప్రకటించింది. మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో సేవల ప్రారంభం నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రకటించారు. 2020  ఆరంభంలో ప్రారంభించనున్నట్లు  స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా వాయిదా వేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలనే కాదు ప్రజలను కూడా నిరాశకు గురిచేసింది. అయితే ఇదే నెలలో మరో తేదీన గ్రామ వార్డు సచివాలయలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  

దేశ చరిత్రలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల విప్లవంను సృష్టించింది. కనీవినీ ఎరగని రీతిలో... నిర్ధిష్ట కాలపరిమితిలోనే లక్షలాధి మంది యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతేకాదు పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రాణం పోసింది.

PawanKalyan Video : పోలీసు తుపాకులకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్

సంక్షేమాన్ని, అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే సచివాలయ వ్యవస్థతో పాలనలో కీలక మార్పులకు నాంది పలికింది. రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాధి మంది ప్రజలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా విన్న వైఎస్ జగన్ వ్యవస్థలోని లోపాలను అవగతం చేసుకున్నారు.

పరిపాలనలో కీలకమైన పంచాయతీ వ్యవస్థ బలహీనంగా మారడం వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని సమూలంగా మార్చాలని ఆయన సంకల్పించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువ చేయాలంటే... పాలన గ్రామ స్థాయిలో పటిష్టం కావాలని నిర్ణయించారు. దీని నుంచే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు బీజాలు పడ్డాయి.

 స్థానిక పాలనతోనే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించిన మహాత్ముడి ఆశయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునాదులు వేసింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 1993లో రాజ్యాంగానికి 73, 74 సవరణలను చేశారు. అయినప్పటికీ నేటికీ విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో బదిలీ కాలేదు.

Perninani Machilipatnam visit : వర్షాకాలంలోగా డివిజన్లలోని పెండింగ్ పనులు పూర్తి

కీలకమైన గ్రామపంచాయతీల్లో సిబ్బంది కొరత, వనరుల లేమి, సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios