అమరావతి: జిల్లాల్లో కొనసాగుతున్న స్పందన  కార్యక్రమంపై ఇప్పటివరకు వస్తున్న నివేదిక ప్రకారం కార్యక్రమం బాగా సాగుతోందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.. ఎక్కువ శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండడానికి చర్యలు చేపట్టామని...దీనిపై అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు.

 ప్రజల నుండి వస్తున్న వినతుల్లో అధికభాగం ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు అంశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు  స్పందన కింద   అందిన వినతులు 6,99,548 కాగా పరిష్కరించినవి 5,57, 55(80 శాతం), పెండింగ్‌ వినతులు 49,337, తిరస్కరించినవి 92,656ఉన్నాయని తెలిపారు. 

వినతుల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం కార్యాలయం నుంచి సెక్రటరీ సాల్మన్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది జిల్లాలకు వెళ్తారని తెలిపారు. కొంతమంది పోలీసు అధికారులు ఈ బృందంలో ఉంటారన్నారు. వీరు ఎమ్మార్వోలు, మున్సిపల్‌ కమిషనర్లు,  క్షేత్రస్థాయిలో అధికారులను కలుస్తారని తెలిపారు. 

read more  చంద్రబాబు-పవన్ ల వ్యూహానికి జగన్ చెక్ : నేరుగా రంగంలోకి సీఎం, ఇక సమరమే...

ప్రజలు సంతృప్తివ్యక్తం చేసేలా వినతులను ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రణాళికలను వారికి వివరిస్తారని వెల్లడించారు. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌పై వీరు పనిచేస్తారని...
నవంబర్‌ 5 నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 

స్పందనపై వచ్చే వినతులను నాణ్యతతో పరిష్కరించగలిగినప్పుడే కలెక్టర్లు, ఎస్పీలకు మంచిపేరు వస్తుందని జగన్ సూచించారు. నా కళ్లు చెవులు, కలెక్టర్లు, ఎస్పీలేనని అన్నారు. 
మీ పనితీరు బాగుంటే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని...అవినీతి అన్నది కనిపించకూడదని సూచించారు.ఎమ్మార్వో , మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లలో అవినీతి అన్నది లేకుండా చూడాలన్నారు. 

 కలెక్టర్లు, ఎస్పీలు క్రియాశీలకంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు. మీరు నవ్వుతూ ప్రజలను ఆహ్వానించినప్పుడు యాభైశాతం సంతృప్తి వస్తుందని  సూచించారు. అవినీతి లేనప్పుడు మిగిలిన యాభైశాతం సంతృప్తి వారికి లభిస్తుందన్నారు. 

read more video:పేకాటలో లక్షల సంపాదన... మహిళా ఐఎఎస్ వద్ద యువకుడి వింత కోరిక

కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఇళ్లస్థలాలపై ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. దీనివల్ల సోషల్‌ఆడిట్‌ జగుతుందని...ఒకవేళ అర్హత ఉండీ ఎవరిపేరైనా జాబితాలో లేకపోతే.. వారు ఎవరికి, ఎలా, దరఖాస్తు చేయాలి? అన్న వివరాలు కూడా ఉండాలన్నారు. ఎవరెవరికి అర్హత ఉంటుందన్నదానిపై ప్రొసీజర్‌ కూడా గ్రామ సచివాలయాల దగ్గర ఉంచాలని జగన్ సూచించారు.

లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు పలానా తేదీనుంచి ఇస్తామని లేఖ కూడా ఇవ్వాలని సూచించారు. దీనివల్ల ప్రజలకు ఎప్పటినుంచి అవి అందుతాయన్న దానిపై అవగాహన ఉంటుందని....  అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా పథకాలు అందరికీ అందుతాయన్నారు.