మంగళగిరి: రాజధానిని అమరావతి నుండి తరలించడాన్ని సీపీఐ పార్టీ వ్యతిరేకిస్తోందని సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదన్నారు. రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ముప్పాళ్ల పేర్కొన్నారు.  

రాజధానిని తమ ప్రాంతం నుండి తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నాయకులను కలిశారు. ఈ క్రమంలోనే మంగళగిరిలో సిపిఐ నాయకులు ముప్పాళ్ళను కూడా కలిసి మద్దతు కోరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గురువారం నుండి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తరువాత అమరావతి పరిరక్షణ సమితితో కలిసి ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 

read more  టిడిపికి షాక్....అధికార పార్టీలోకి భారీ వలసలు, మంత్రి సమక్షంలో చేరికలు

రాజధాని లేకుండానే విశాఖ అభివృద్ధి చెందిందని అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా చేయాల్సిన  అభివృద్ది ఏమీ లేదన్నారు. అన్ని వనరులూ ఉన్నాయి కనుకే విశాఖ అభివృద్ధి చెందిందన్నారు. కొత్తగా రాజధాని తరలింపుతో విశాఖ అభివృద్ధి చెందేదేమి లేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ ఆలోచనను విరమించుకోవాలని ముప్పాళ్ల సూచించారు. సిపిఐ  పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటుంది కానీ పాలనా వికేంద్రీకరణ కాదున్నారు. 

read more  అమరావతికి రక్షణగా వున్న చట్టాలివే... ఒక్క కలంపోటుతో...: ఎంపీ కనకమేడల

మద్రాసు నుండి విడిపోయినప్పుడే వామపక్ష పార్టీలు రాజధానిగా విజయవాడనే ప్రతిపాదించాముమన్నారు. అయితే ఇక్కడ వామపక్షాలు బలంగా ఉన్నందునే   రాజధానిని కర్నూలుకు తరలించారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ముప్పాళ్ల పేర్కొన్నారు.