ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు  కొనసాగుతున్నాయి. ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి భారీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

తాజాగా బుధవారం మర్రిపాడు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన టిడిప నాయకులు వైసిపి తీర్థం  పుచ్చుకున్నారు. నాగేళ్ల వెంకటేశ్వర్లుతో పాటు ఆయన అనుచరులు మంత్రి గౌతమ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని మంత్రి పునరుద్ఘాటించారు.
  ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని... కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలుపుకుపోవాలని సూచించారు. 

read more  అమరావతికి రక్షణగా వున్న చట్టాలివే... ఒక్క కలంపోటుతో...: ఎంపీ కనకమేడల

నియోజకవర్గ పరిధిలో 4721.00 లక్షలతో సిమెంట్ రోడ్లు మంజూరయినట్లు మంత్రి తెలిపారు. మర్రిపాడు మండలం నందవరం పొంగూరు గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లతో పాటు  గ్రామ సచివాలయం భవనాలను మంత్రి ప్రారంభించారు.   

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు కుల మత ప్రాంత వర్గాలకు తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 4721.00 లక్షల అంచనా విలువ వ్యయంతో 527 సిమెంట్ రోడ్డు పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. 

read more రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య: కన్నా

 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాని 37 గ్రామ పంచాయతీల్లో అంచనా విలువ 1026.00 లక్షలతో 119 సిమెంట్ రోడ్లు పనులు కేటాయించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలో 30 సచివాలయ భవనాలు 1020.00 లక్షలతో చేపడుతున్నామని పేర్కొన్నారు. నాడు-నేడు పథకంలో నియోజకవర్గ పరిధిలో స్కూల్స్ అభివృద్ధి పరుస్తామని మేకపాటి తెలిపారు.

 నందవరం గ్రామంలో క్రిస్మస్, ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి మేకపాటి పాల్గొన్నారు. గ్రామంలో చిన్న పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.