తుళ్లూరు పంచాయితీకి నల్లరంగు... నాన్ బెయిల బుల్ అరెస్టులే

అమరావతి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని తరలించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆ ప్రాంత ప్రజలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో తుళ్లూరు పంచాయితీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

amaravati movement... tullur police arrested 10 members

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ ఆ ప్రాంతంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తుళ్లూరు గ్రామ పంచాయితీకి కొందరు నల్లరంగుతో పెయింట్ చేసి కొందరు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రభుత్వ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతులు నల్లరంగు వేసిన నిరసనకారులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

పంచాయితీ సెక్రటరీ యం. శివరామకృష్ణ ఫిర్యాదుమేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ  చర్యలకు పాల్పడిన పది మందిని  గుర్తించి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో నిందితులుగా నిర్దారణ అయితే నాన్ బెయిల బుల్ అరెస్ట్ చేయనున్నట్లు తెలపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

తూళ్లూరుతో పాటు మల్కాపురం, వెలగపూడి, రాయపూడి కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలపై సెక్షన్ 427,03 క్రింద కేసు నమోదు  చేసినట్లు తెలుస్తోంది. గత రాత్రి సచివాలయం వద్ద హింసాత్మక ఘటనకు ప్రోత్సహించిన వారిపై188,341,353,427 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు తుళ్లూరు పోలీసులు తెలిపారు.

GN Rao Committee : రంగులు మార్చిన వైసీపీ అభిమానులు...

 జీఎన్ రావు కమిటీని నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాలకు చెందిన సామాన్యులు, రైతులే కాదు మహిళలు కూడా నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా మందడం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు దగ్దం చేసి తమ ఆందోళనలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలను దగ్థం చేశారు.

 మూడు రోజులుగా అమరావతి సమీపంలో మందడం, వెలగపూడి, తుళ్ళూరు తో పాటు పలు గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తున్నారు. మందడం వద్ద సీడీ యాక్సెస్ రోడ్డు నుండి సచివాలయం రోడ్డును రైతులు బ్లాక్ చేశారు. రోడ్డుపై అడ్డంగా సిమెంట్ బెంచీలు వేశారు. రోడ్డుపై వాహనాలను అడ్డంగా నిలిపారు.

రోడ్లపైనే టైర్లను దగ్ధం చేశారు.  జీఎన్ రావు కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికనపు పరిగణనలోకి తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ 29 గ్రామాల ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు.

GN Rao Committee : రంగులు మార్చిందెవరో తెలియదు...విచారణ చేయించండి..

 వివిధ రూపాల్లో స్థానికులు, రైతులు ఆందోళనలకు దిగారు. వెలగపూడిలో రైతులు మూడో రోజు దీక్షలు చేస్తున్నారు. వెలగపూడి గ్రామపంచాయితీ కార్యాలయానికి వైసీపీ రంగులను రైతులు తుడిచివేసే ప్రయత్నం చేశారు.గ్రామ పంచాయితీ కార్యాలయానికి రంగు వేస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు రైతులు గ్రామపంచాయితీ కార్యాలయానికి నల్లరంగు పూయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో వెలగపూడి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు  దున్నపోతుతో రైతులు, స్థానికులు మందడంలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని స్థానికులు విమర్శలు గుప్పించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios