మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ చుక్కలు: 'మా'కు పోటీగా ఆత్మా?

మా ఎన్నికల్లో విజయం సాధించిన వారందరి చేత రాజీనామా చేయించి మరో సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రకాశ్ రాజ్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ప్యానెల్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారని ప్రచారం సాగుతోంది.

Manchu Vishnu vs Prakash Raj: New forum Atmaa may be floated

హైదరాబాద్: కథ ఇప్పుడే మొదలవుతుందని మా ఎన్నికల్లో మంచు విష్ణుపై ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ అన్నారు. అన్నట్లుగానే ఆయన మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చుక్కలు చూపించబోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మాకు పోటీగా మరో సంస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దాన్ని ఆత్మాగా చెబుతున్నారు.

MAA ఎన్నికల్లో Prakash raj ప్యానెల్ నుంచి 8 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గెలిచారు. Manchu Vishnu ప్యానెల్ నుంచి 10 మంది గెలిచారు. ఈ పది మంది రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే మా సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించేది లేదని మంచు విష్ణు చెప్పారు. తనకు ప్రకాశ్ రాజ్ ఐడియాలు, ఆలోచనలు కావాలని ఆయన అన్నారు. 

Al;so Read: రాజీనామా యోచనలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్.. ‘‘మా’’కు పోటీగా కొత్త అసోసియేషన్..?

అయితే, ప్రకాశ్ రాజ్ తన ఓటమిని ఆషామాషీగా తీసుకోవడం లేదని అర్థమవుతోంది. తాను ఓడిపోయినందుకు రాజీనామా చేయడం లేదని, తనకు ఆత్మగౌరవం ఉందని, అందువల్లనే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు అంతేకాకుండా ప్రాంతీయవాదానికి, జాతీయవాదానికి జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ వాదం గెలిచిందని ఆయన ఆయన అన్నారు. తెలుగువాడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నానని, తాను తెలుగువాడిని కానని, తన తల్లిదండ్రులు తెలుగువారు కాదని, అందుకు తానేమ చేయలేనని ఆయన అన్నారు. తనకు మాతో 21 ఏళ్ల అనుబంధం ఉందంటూనే ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తూ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

ఇదిలావుంటే, తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శివాజీరాజా అన్నారు. దాన్ని మంచు విష్ణు తేలికగా తీసుకుంటూ అలా చేస్తే తాను Shivaji Raja ఇంటికి వెళ్లి కొరికేస్తానని అన్నారు. అయితే, విషయం అంతా మామూలు వ్యవహారంగా లేదని అర్థమవుతోంది. మా సభ్యులు లేదా తెలుగు సినిమా ఆర్టిస్టులు నిట్టనిలువునా చీలే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ చోటు చేసుకుంది. శ్రీకాంత్, శివాజీరాజా, ప్రకాశ్ రాజ్ కలిసి ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ATMAA)ను ప్రారంభిస్తారని అంటున్నారు. తెలుగు సినిమాల్లో నటించే అందరు కూడా ఇందులో ఉంటారని వారు చెప్పే అవకాశం ఉంది. 

Also Read: మోహన్ బాబు వర్సెస్ చిరు: లోలోపలే బాలకృష్ణ, దెబ్బ తీసిన పవన్ వ్యాఖ్యలు

అయితే, ఇదంతా ఒట్టిదేనని కొంత మంది కొట్టిపారేస్తున్నారు. అయితే, ప్రకాశ్ రాజ్ అంత దూరం వెళ్తారని అనుకోవడం లేదని అంటున్నారు. మా వ్యవస్థాక అధ్యక్షుడిగా చిరంజీవి పనిచేశారు. చిరంజీవి దాని నుంచి తప్పుకునే అవకాశం లేదని అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios