Asianet News TeluguAsianet News Telugu

రాజీనామా యోచనలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్.. ‘‘మా’’కు పోటీగా కొత్త అసోసియేషన్..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు (maa elections) ముగిసినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. మాకు పోటీగా మరొక అవకాశం వచ్చే ఛాన్స్ వుందంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

maa elections will prakash raj panel ready to resign
Author
Hyderabad, First Published Oct 12, 2021, 2:33 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు (maa elections) ముగిసినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. మాకు పోటీగా మరొక అవకాశం వచ్చే ఛాన్స్ వుందంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ (manchu vishnu) నుంచి 10 మంది ఈసీ మెంబర్స్ గెలిచారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ (prakash raj) నుంచి 8 మంది విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ అంతా రాజీనామా చేస్తే పరిస్ధితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మళ్లీ అదే పోస్టులకు ఎన్నికలు పెడతారా..? లేదా అన్నది ఇంట్రెస్ట్‌గా మారింది. ఇప్పటికే మా అసోసియేషన్‌కు మెగాబ్రదర్ నాగబాబు (nagababu) , ప్రకాశ్ రాజ్ ఇద్దరూ రాజీనామా చేసేశారు. ఇక మరో ప్రముఖుడు శివాజీ రాజా (shivaji Raja) కూడా రేపో మాపో రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విష్ణు మాత్రం ఎవరి  రాజీనామాలను ఆమోదించనని తేల్చి చెప్పేశారు. 

గతం గత: అంటున్నారు మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు. హోరాహోరీ పోరులో విజయం దక్కించుకున్న ఆయన అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని చెబుతున్నారు. ఏ ఆటలోనైనా ఇద్దరు ఆడితే ఒక్కరే గెలుస్తారని తన విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అవతలి ప్యానెల్‌లో గెలిచిన వారితో కలిసి పనిచేస్తామన్నారు. సోమవారం మా ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విష్ణు.. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కలిసి తమ కష్టాల్ని, సమస్యల్ని వివరిస్తామన్నారు. 

ALso Read:మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ రాజీనామా లేఖలో ఏం రాశారంటే..?

మరోవైపు చెప్పినట్లుగానే నాగబాబు, ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మా లో ప్రాంతీయవాదం పట్ల తీవ్ర నిరాశ చెందానన్న నాగబాబు.. తన లేఖను విడుదల చేశారు. అలాగే మా సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని.. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. కాగా నాగబాబు ఆవేశంతో నిర్ణయం తీసుకుని వుండొచ్చని.. ఆయనను త్వరలోనే కలిసి నచ్చజెపుతాని విష్ణు తెలిపారు. అలాగే ప్రకాశ్ రాజ్ సలహాలు, సూచనలు కావాలని అన్నారు. ఇక శివాజీ రాజా రాజీనామా చేస్తానంటే ఇంటికెళ్లి కొరుకుతానని చెప్పారు. 

మరోవైపు మోహన్ బాబు తనకు ఇండస్ట్రీ పెద్దరికం వద్దని అన్నారు. తనను ఎందరో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కానీ సంయమనం పాటించానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సాయం తీసుకుంటానని మోహన్ బాబు (mohan babu) చెప్పారు. అటు స్టార్ యాంకర్ అనసూయ (anasuya) తన ఓటమిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. తొలి రోజు తనదే విజయమని ప్రచారం చేశారని.. రెండో రోజు ఓటమి అన్నారని రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తుండటంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనని సినీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios