ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈరోజు మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. స్టార్ సింగర్ ఎస్ జానకి తనయుడు మురళీకృష్ణ తుదిశ్వాస విడిచారు. జానకి కుమారుడు ఎవరు? ఆయన ఏం చేస్తారు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత మంది సినీ ప్రముఖులను పరిశ్రమ కోల్పోయింది. రిసెంట్ గా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 65 సంవత్సరాల వయసులో మురళీ కృష్ణ మరణం.. వారి కుటుంబంతో పాటు.. ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆవేదన కలిగించింది.
సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్..
మురళీ కృష్ణ మరణ వార్తను మరో స్టార్ సింగర్ చిత్ర వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ''ఈ బాధకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని.. తాను ఎంతో ప్రియమైన సోదరుడిని కోల్పోయాను, ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని నేను షాకయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాము. ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక.. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ రాసుకొచ్చారు సింగర్ చిత్ర.
భరతనాట్యంలో ప్రావీణ్యం
సింగర్ జానకి తనయుడు మురళీకృష్ణ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయన నటుడు, నాట్యకళాకారుడు. భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీ.. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతే కాదు ఆయన పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మురళీకృష్ణ మృతితో ఎస్. జానకి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు జానకికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆమెకు మనోదైర్యాన్నిప్రసాదించాలని కోరుకుంటున్నారు.


