Shampoo: ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఏం చేయాలో తెలుసా?
Shampoo: మనకు మార్కెట్లో కూడా హెర్బల్ షాంపూలు దొరుకుతాయి. కానీ, వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు అనే గ్యారెంటీ ఇవ్వలేం. అదే షాంపూ కొంచెం కూడా కెమికల్స్ లేకుండా ఇంట్లో చేసుకోవచ్చంటే మీరు నమ్మగలరా?

herbal shampoo
అందమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దాని కోసమే.. రెగ్యులర్ గా హెయిర్ కేర్ రొటీన్ పాలో అయ్యేవారు కూడా ఉంటారు. వాటిలో భాగంగానే.... చాలా మంది మార్కెట్లోని ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ.. అంత ఖరీదైనవి వాడినా కూడా జుట్టు రాలడం, జుట్లు చిట్లడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే... కెమికల్స్ ఉండే.. ఆ ఉత్పత్తులు వాడటానికి బదులు....మీరే ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం....
హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలంటే....
ఈ హెర్బల్ షాంపూ తయారీలో మీరు వేప, తులసి ఆకులను ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా, వేప ఆకులను వేడి నీటిలో మరిగించాలి. అందులోనే తులసి ఆకులను కూడా జోడించాలి. ఈ ఆకులను వేసిన నీరు సగానికి అయ్యేంత వరకు ఆ నీటిని మరిగించాలి. ఆ నీటిలో.. సల్ఫేట్ లేని షాంపూని కలపాలి. తర్వాత దీనిని మీరు నేరుగా మీ జుట్టుకు వాడొచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా కనపడుతుంది. చుండ్రు సమస్య ఉండదు. జుట్టు చివరలు చిట్లిపోయే సమస్య కూడా ఉండదు. అసలు బయట షాంపూ వాడటం ఇష్టం లేనివాళ్లు... కుంకుడు కాయ రసాన్ని వాడొచ్చు. దాని కోసం నీటితో శుభ్రం చేసిన కుంకుడు కాయలను నీటిలో వేసి బాగా మరిగించాలి. అందులోనే కొన్ని మందార ఆకులను కూడా చేర్చవచ్చు. బాగా మరిగిన తర్వాత... ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. దీనిలోనే..వేప, తులసి ఆకుల మిశ్రమాన్ని కలిపితే సరిపోతుంది.
తులసి, వేప హెర్బల్ షాంపూ...
ఈ షాంపూను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును మృదువుగా, అందంగా చేస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ తులసి, వేప హెర్బల్ షాంపూని ఉపయోగించడం ద్వారా మీరు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ షాంపూ మనకు తక్కువ ఖర్చుతో తయారౌతుంది. ఉపయోగించడం వల్ల.. ఎలాంటి నష్టాలు కూడా ఉండవు.
షాంపూ ఎలా వాడాలంటే....
మీరు ఈ షాంపూని ఉపయోగించినప్పుడల్లా, మొదట మీ జుట్టును నీటితో శుభ్రం చేయాలి , ఆ తర్వాత, మీరు మీ జుట్టును బాగా కడగడానికి ఈ తులసి , వేప నీటి షాంపూని ఉపయోగించవచ్చు. షాంపూ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మర్చిపోవద్దు. రెగ్యులర్ గా వాడటం వల్ల... ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.