Hair Care: ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ ఫుడ్స్ తింటే... ఒక్క వెంట్రుక కూడా రాలదు
Hair Care: జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. దానికి కెరాటిన్ అనే ప్రోటీన్ అవసరం. మన ఆహారంలో ప్రోటీన్ తగిన మోతాదులో లేకపోతే, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే కొన్ని ఫుడ్స్ రోజూ తింటే... ఈ జుట్టు రాలే సమస్యే ఉండదు.

Hair Care
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకోరు. కానీ తరచుగా జుట్టు రాలడం, పొడిబారడం, నిస్తేజంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటాం. ఈ సమస్యల వెనక ప్రధాన కారణం పోషకాహార లోపం. ముఖ్యంగా ప్రోటీన్ కొరత ఉన్నప్పుడు హెయిర్ లాస్ మరింత ఎక్కువగా ఉంటుంది.
జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారౌతుంది. అందువల్ల, మన ఆహారంలో ప్రోటీన్ తగిన మోతాదులో లేకపోతే, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. జుట్టు కూడా బలహీనమౌతుంది. కాబట్టి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఆహారంలో తగిన ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి. మరి.. ఎలాంటి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే... జుట్టు ఒత్తుగా, అందంగా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం...
1.గుడ్డు...
కోడి గుడ్డు ప్రోటీన్ తో సమృద్ధిగా ఉండే ఆహారాలలో మొదటి స్థానంలో ఉంటుంది. గుడ్డులో ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. అదనంగా గుడ్డులోని బయోటిన్ ( విటమిన్ బి7) జుట్టు పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన విటమిన్. ఇది కొత్త జుట్టు పెరగడానికి, రాలిపోతున్న జుట్టును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. గుడ్డు పచ్చసొనలో ఉన్న విటమిన ఏ, డి, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ జుట్టును బలంగా, మెరిసేలా మారుస్తాయి.
2.చికెన్...
చికెన్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లో సుమారు 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలోని కణజాలలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు శరీరానికి ఐరన్, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడంలో సహాయపడతాయి. ఇవి జుట్టు బలంగా మారడానికి సహాయపడతాయి.
3.నట్స్, సీడ్స్...
బాదం, వాల్‌నట్‌లు, చియా సీడ్స్ వంటి గింజలు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. ఇవి ప్రోటీన్ మాత్రమే కాకుండా విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి శక్తివంతమైన పోషకాలను అందిస్తాయి. బాదంలో ఉన్న విటమిన్ E జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చియా సీడ్స్ లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ నెత్తి చర్మాన్ని మృదువుగా ఉంచి, కొత్త జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.
4.పాల ఉత్పత్తులు..
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ జుట్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తే, కాల్షియం జుట్టు పెరుగుదల , బలాన్ని పెంచుతుంది. పెరుగు జుట్టు కుదుళ్లను శుభ్రంగా ఉంచి మానసిక ఒత్తిడిని తగ్గించే సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది.
5.చేపలు..
సాల్మన్, సార్డిన్, రోహు వంటి చేపలు ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి.
చేపలలో ఉండే విటమిన్ D కూడా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఫైనల్ గా...
జుట్టు బలహీనంగా మారడం లేదా రాలిపోవడం కేవలం బాహ్య సంరక్షణతో మాత్రమే తగ్గదు. అంతర్గతంగా సరైన పోషకాహారం అవసరం.
ఈ ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా జుట్టు సహజంగా బలపడుతుంది, మెరుస్తుంది, వేగంగా పెరుగుతుంది.