Beauty Tips: ఇదొక్కటి రాసినా.... ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాల్సిందే
Beauty Tips: పడుకునే ముందు, కొద్దిగా బంగాళ దుంప రసాన్ని మీ ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేరయడం వల్ల ముఖం యవ్వనంగా మారుతుంది.

Beauty tips
అందాన్ని పెంచుకోవాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? దాని కోసమే వేల రూపాయలు ఖర్చు చేసి మరీ క్రీములు కొని, ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ, ఆ క్రీముల అవసరం లేకుండా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వయసు రిత్యా వచ్చే ముడతలు, నిద్ర సరిగా లేక వచ్చే డార్క్ సర్కిల్స్ ని చాలా ఈజీగా తొలగించొచ్చు. దాని కోసం... బంగాళదుంప ఉంటే చాలు. మరి, దానిని ముఖానికి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం....
బంగాళ దుంపతో ఫేస్ మాస్క్...
కావాల్సిన పదార్థాలు..
1మీడియం సైజు బంగాళ దుంప, పావు కప్పు దానిమ్మ గింజలు, కొద్దిగా పాలు, నిమ్మరసం( జిడ్డు చర్మం ఉన్నవారు)
ఫేస్ మాస్క్ తయారీ విధానం...
ముందుగా బంగాళదుంపను నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీనిని తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను, దానిమ్మ గింజలను కూడా కలిపి మిక్సర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ పేస్టులో పచ్చి పాలు కూడా కలపాలి. మీది జిడ్డు చర్మం అయితే.. నిమ్మరసం జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. అది చల్లగా మారిన తర్వాత.. ముఖంపై అప్లై చేయాలి. దానిని సర్కిల్ రూపంలో మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు అప్లై చేస్తే చాలు. మీ ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. బంగాళదుంప లోని సహజ ఎంజైమ్ లు డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా సహాయపడతాయి.
బంగాళ దుంప రసం...
పడుకునే ముందు కొద్దిగా బంగాళాదుంప రసాన్ని కాటన్ ప్యాడ్‌తో ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజూ చేస్తే, క్రమంగా నల్లటి వలయాలు తగ్గి, ముఖం సహజంగా మెరుస్తుంది. ఇది కేవలం అందాన్ని మాత్రమే కాదు, చర్మానికి చల్లదనాన్ని కూడా అందించి, మంచి నిద్రకు సహాయపడుతుంది.
నిపుణుల సలహా...
బ్యూటీ నిపుణుల ప్రకారం, బంగాళాదుంపలోని సహజ ఆమ్లాలు చర్మానికి ఏ దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తాయి. అన్ని వయసుల వారు దీనిని నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు. దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి.... ఎలాంటి డ్యామేజ్ ఉండదు.