Women Weight lifting: మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
Women Weight lifting : వెయిట్ లిఫ్టింగ్ చేయడం అందరికీ మంచిదే. కాని పురుషులు మాత్రమే ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు కదా.. అయితే మహిళలు బరువులు ఎత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు, వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జిమ్ లో పురుషులు భారీగా మొత్తంలో బరువులు ఎత్తుతూ కనిపిస్తారు. మహిళలైతే థ్రెడ్ మిల్, లెస్ వెయిట్ డంబుల్స్ లాంటి సింపుల్ ఎక్సర్సైజస్ చేస్తుంటారు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల మగవాళ్ల మాదిరిగా భారీగా కండరాలు పెరగవు. ఎందుకంటే మహిళల శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. సరిగ్గా, సరైన పద్ధతిలో బరువులు ఎత్తడం వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. ఇవే కాకుండా మహిళలు బరువులు ఎత్తడం రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
1. బలం, దృఢత్వం పెరుగుతుంది
మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కేవలం సన్నగా మారటమే కాకుండా శరీరం బలంగా మారుతుంది. రోజువారీ పనులు సులభంగా చేయగలుగుతారు.
2. బరువు నియంత్రణలో ఉంటుంది
బరువులు ఎత్తే వ్యాయామం చేయడం వల్ల మెటాబాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
3. ఎముకల ఆరోగ్యానికి మంచిది
మహిళలకు వయసు పెరిగేకొద్దీ ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఒస్టియోపోరోసిస్ (osteoporosis) అనే వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.
4. హార్మోన్ల బ్యాలెన్సింగ్
బరువులు ఎత్తడం వల్ల థైరాయిడ్ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. దీంతో డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది.
5. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది
వర్కౌట్ సమయంలో ఎండార్ఫిన్స్ (endorphins) విడుదలవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆటోమెటిక్ గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
6. గుండె ఆరోగ్యానికి మంచిది
వెయిట్ లిఫ్టింగ్ కేవలం కండరాలను బలపరచడమే కాదు. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.
7. శరీరం నాజూగ్గా మారుతుంది.
మరీ పెద్ద మొత్తంలో బరువులు ఎత్తకుండా మీ శక్తికి తగిన బరువులు ఎత్తడం వల్ల మీ శరీరం చక్కటి షేప్ లో ఉంటుంది. రోజువారీ పనుల్లో శరీర సమతుల్యత మెరుగవుతుంది.
8. మెనోపాజ్ తరువాత కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు
వయస్సు పెరిగేకొద్దీ కండరాల శక్తి తగ్గకుండా ఉండేందుకు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం చాలా మంచిది.