ఈ ఒక్క టిప్‌తో ఎర్ర చీమలను మీ కిచెన్ లోంచి తరిమేయండి
ఎర్ర చీమలు మీ కిచెన్ ను వదిలిపోవడం లేదా? వాటిని వంట గది నుంచి తరిమేయాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. దీనికంటే ముందు అసలు చీమలు మీ ఇంట్లో కిచెన్ లోకే ఎందుకు వస్తున్నాయో ముందు కారణాలు తెలుసుకోండి. అప్పుడు వాటిని పర్మనెంట్ గా రాకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
కిచెన్ లోకే ఎందుకు..
ఎర్ర చీమలు తరచుగా కిచెన్ లో కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఆహార పదార్థాల వాసనను కనిపెట్టి అక్కడికి వచ్చేస్తాయి. అక్కడ వంటలో మిగిలిన పదార్థాలు తినడానికి వీలుగా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ పై మూతలు తీసి ఉంటే ఆ వాసన ద్వారా చీమలు వాటి దగ్గరకు వచ్చేస్తాయి. సాధారణంగా చాలా దూరం నుండి ఆహారాన్ని గుర్తించే సామర్థ్యం చీమలకు ఉంటుంది. కిచెన్ అయితే వాటికి తెరచిన ఆహార నిధి. అందుకే చీమలు, ముఖ్యంగా ఎర్ర చీమలు కిచెన్ లోనే కనిపిస్తుంటాయి.
వెచ్చని వాతావరణం
ఎర్ర చీమలు కిచెన్ లోకే తరచుగా రావడానికి కారణం అక్కడ ఉండే వెచ్చని వాతావరణం. వంటశాలల్లో కాస్త వేడిగా ఉంటుంది. ఈ వెదర్ కీటకాలన్నింటికీ చాలా నచ్చుతుంది. అందుకే చీమలే కాకుండా బొద్దింకలు, బల్లులు వంటింట్లోనే కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో అయితే బయట తిరిగే పురుగులు కూడా వంటింట్లోకి వచ్చేస్తాయి. అంతే కాకుండా కిచెన్ లో కిటికీలు, కబ్ బోర్డులు, డోర్ సందులు వాటికి నివాసాలుగా మారిపోతాయి. వర్షాకాలం, చలికాలాల్లో వెచ్చని వాతావరణం కోసం అవన్నీ వంటిల్లును ఆశ్రయిస్తాయి.
శుభ్రంగా ఉంచడమే సొల్యూషన్
ఎర్ర చీమలు మీ వంటగదిలోకి రాకుండా నిరోధించాలంటే శుభ్రత పాటించడం ఒక్కటే మార్గం. నేలలను క్రమం తప్పకుండా తుడుచుకోవాలి. చీమలను ఆకర్షించే ఆహార పలుకులు, చిన్న చిన్న వ్యర్థాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారాన్ని గాలి చొరబడని పాత్రలలో నిల్వ చేయడం మంచిది. కౌంటర్లు, టేబుల్‌లపై ఉన్న ఏవైనా ముక్కలు లేదా మరకలను తక్షణమే శుభ్రం చేయడం ద్వారా చీమల సమస్య నుంచి బయటపడవచ్చు.
వెనిగర్ లాంటి లిక్విడ్స్ వాడండి
చీమలు రాకుండా చేయాలంటే మరో నేచురల్ మెథడ్ ఏంటంటే చీమలకు ఇష్టం లేని వాతావరణాన్ని సృష్టించాలి. వెనిగర్ లాంటి లిక్విడ్స్ వాడటం వల్ల చీమలు వంటిల్లు దరిదాపులకు కూడా రావు. ఆ స్మెల్ వాటిని పడదు. దీంతో దాక్కుని ఉన్న చీమలు కూడా పారిపోతాయి. తలుపులు, కిటికీలు, వెంటిలేషన్ వద్ద వెనిగర్ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఇవి మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి.