సమ్మర్ లో ఏ చీరలు కట్టుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది?
చీరలంటే ఆడవాళ్లకు ఎక్కడలేని ఇష్టం. రకరకాల చీరలు కొంటు అందంగా ముస్తాబవుతుంటారు. అయితే ఎండాకాలంలో కొన్ని చీరలే కంఫర్ట్ గా ఉంటాయి. లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఎండాకాలంలో ఎలాంటి చీరలు కట్టుకోవాలంటే?
ప్రతిఒక్క మహిళలకు చీరలంటే చాలా ఇష్టం. అలాగే ప్రత్యేక సందర్భాల్లో అందమైన చీరలను కట్టుకుంటుంటారు. చీరలు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ అయితే చీరల్లో కూడా మీరు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తారు. అయితే సమ్మర్ లో చీర కట్టుకోవడం చాలా కష్టమైన పనే. ఈ సీజన్ లో ఎండలు మండిపోతాయి. కొన్నిచీరలు శరీర వేడిని మరింత పెంచుతాయి. అయితే సమ్మర్ సీజన్ లో మీరు చీర కట్టుకోవాలనుకుంటే ఎలాంటి చీరలు కట్టుకోవాలి? ఏ చీరల్లో మీరు స్టైలీష్ గా కనిపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చిఫాన్ చీర
చిఫాన్ చీరలు సమ్మర్ సీజన్ కు బెస్ట్ ఆప్షన్. ఈ చీరలు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. చిఫాన్ చీరల్లో వైన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవాటిని కట్టుకుంటే మీరు అందంగా కనిపిస్తారు. ఈ చీరలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. హాఫ్ స్లీవ్స్ తో బ్లౌజ్ తో పాటుగా ఈ చీరపైకి మీరు మినిమమ్ నగలను వేసుకోవచ్చు. ఈ షిఫాన్ చీరలు మీకు ఎన్నో కలర్లలో దొరుకుతాయి. డిజైన్లు కూడా ఎన్నో ఉంటాయి. వీటిని మీరు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో కొనొచ్చు.
కాటన్ చీర
ఎండాకాలంలో కాటన్ చీరలకు మించి బెస్ట్ కంఫర్ట్ సారీస్ మరొకటి ఉండవు. కాటన్ చీరలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల చీరల్లో మీరు అందంగా కూడా కనిపిస్తారు. ఇక ఈ చీరలను మీరు జాగ్రత్తగా చూసుకోవడం పెద్దగా కష్టమేమీ కాదు. మీరు కూడా ఈ వేసవిలో కాటన్ చీరలు కట్టుకోవాలనుకుంటే ప్లేన్ చీరలను ట్రై చేయండి. ఈ రకమైన చీరతో హీల్స్ లేదా ఫ్లాట్లను వేసుకోవచ్చు. ఈ రకమైన చీరలు చాలా కలర్లలో మీకు దొరుకుతాయి. ఇలాంటి చీరలను ఆన్లైన్లో కూడా కొనొచ్చు.
చందేరి చీర
చందేరి చీరను సిల్క్ తో తయారు చేస్తారు. అలాగే ఇది తేలికపాటి పట్టు సారీ. అందుకే మీరు వేసవి కాలంలో ఈ చందేరీ చీరలను కూడా కట్టుకోవచ్చు. సిల్క్ లో ఉండటం వల్ల ఈ చీరను కట్టుకున్న తర్వాత రాయల్ లుక్ లో కనిపిస్తారు. అలాగే చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ చీరకట్టుకున్నప్పుడు మీరు పెద్ద పెద్ద చెవిపోగులను పెట్టుకోవచ్చు. వీటిని ఆన్ లైన్ లో వీటిని నచ్చిన రంగుల్లో కొనొచ్చు. మంచి మంచి డిజైన్లు కూడా అందుబాటులో ఉంటాయి.