ఈ కలర్ డ్రెస్సులు, చీరల్లో లావుగా ఉన్నవారు సన్నగా కనిపిస్తారు
లావుగా ఉన్నవారు నచ్చిన డ్రెస్ ను వేసుకోలేరు. నచ్చిన విధంగా రెడీ అవ్వలేరు. సన్నగా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు ఎంత లావుగా ఉన్నా కొన్ని రంగుల డ్రెస్సులో చాలా స్లిమ్ గా కనిపిస్తారు.
ఒక్కొక్కరికి ఒక్కో రంగంటే ఇష్టముంటుంది. కొంతమందికి వైట్ కలర్ ఇష్టముంటే మరికొంతమందికి బ్లాక్, గ్రీన్, ఎల్లో, రెడ్ ఇలా రకరకాల కలర్లను ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని డ్రెస్సుల కలర్లు మీ వెయిట్ ను దాచేస్తాయి.
అవును కొన్ని కలర్లు మీరెంత లావుగా ఉన్నా సన్నగా కనిపించేలా చేస్తాయి. శరీర కొవ్వును రంగులతో కూడా దాచిపెట్టొచ్చు తెలుసా? అసలు ఏ రంగులు మీ శరీరానికి స్లిమ్ లుక్ ను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నలుపు రంగు
బ్లాక్ కలర్ ను చాలా మంది ఇష్టంగా ధరిస్తారు. బ్లాక్ కలర్ ఉన్న రకరకాల డిజైన్ డ్రెస్సులను ట్రై చేస్తుంటారు. అయితే ఈ రంగు మీ బరువును దాచడానికి కూడా ఉపయోగించొచ్చు. అవును బ్లాక్ కలర్ డ్రెస్సులో మీరు ఎంత లావుగా ఉన్నా సన్నగానే కనిపిస్తారు. నిజానికి నలుపు రంగు దుస్తులు శరీరాన్ని స్లిమ్ గా కనిపించేలా చేస్తాయనే భ్రమను కలిగిస్తాయి.
డార్క్ నీలం రంగు
డార్క్ నీలం రంగు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ చాలా మంది ఈ రంగు డ్రెస్సులను ధరించరు. కానీ ముదురు నేవీ బ్లూ కలర్ దుస్తులు మీ ఓవర్ వెయిట్ ను దాచేస్తాయి. ఈ కలర్ డ్రెస్సుల్లో కూడా మీరు స్లిమ్ గా కనిపిస్తారు.
ఊదా
డార్క్ పర్పుల్ కలర్ కూడా ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కలర్ దుస్తులను మీరు ఎన్నో రకాల డిజైన్లలో ట్రై చేయొచ్చు. దీనిలో కూడా మీ లుక్ చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఈ కలర్ కాకుండా డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సులను కూడా మీరు వేసుకోవచ్చు. వీటిలో కూడా మీరు స్లిమ్ గా కనిపిస్తారు.
వైన్ రంగు
వైన్ కలర్ చాలా అందంగా ఉంటుంది. ఈ కలర్ డ్రెస్సుల్లో మీరు అందంగా కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫంక్షన్ లో హెవీ బాడీ స్లిమ్ గా కనిపించాలంటే మీరు డార్క్ వైన్ కలర్ డ్రెస్సులను వేసుకోండి. ఈ కలర్ లో కూడా మీ శరీరం సన్నగా కనిపిస్తుంది.
ఎమరాల్డ్ గ్రీన్ కలర్
ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కూడా ప్రతి ఒక్కరికీ బాగా నప్పుతుంది. ముఖ్యంగా లావుగా ఉన్నవారు సన్నగా కనిపించాలనుకుంటున్నవారికి కూడా బాగా సెట్ అవుతుంది. మీరు సన్నగా, అందంగా కనిపించాలంటే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డ్రెస్సులను వేసుకోండి. ఈ రంగు దుస్తులు చాలా రాయల్ లుక్ ను ఇస్తాయి.
డిజైన్
కేవలం రంగులే కాకుండా బట్టల ప్యాటర్న్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలుతీసుకోవాలి. స్లిమ్ గా కనిపించడానికి మోనోక్రోమాటిక్ షేడ్స్ ఉన్న దుస్తులను సెలక్ట్ చేసుకోండి. దీని వల్ల హెవీ బాడీ స్లిమ్ గా కనిపిస్తుంది. అలాగే బట్టల్లో ప్రింట్స్ విషయంలో కూడా చూసుకోవాలి. చిన్న చిన్న ప్రింట్ల దుస్తులు కూడా మీ హెవీ బాడీకి స్లిమ్ అండ్ కర్వ్ లుక్ ను ఇస్తాయి.