Periods: పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి తింటే మంచిది
Periods: పీరియడ్స్ కు ముందు ఆడవాళ్ల శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అలసటగా, బలహీనంగా, మూడీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలను తింటే చాలా మంచిది. అవేంటంటే?

పీరియడ్స్
పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, తిమ్మిరి, కాళ్లు, చేతులు లాగడం, బలహీనంగా ఉండటం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే పీరియడ్స్ కు ముందు కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి సమస్యల నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అందుకే పీరియడ్స్ మొదలుకావడానికి ముందు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అల్లం టీ
పీరియడ్స్ మొదలయ్యే ముందు అల్లం టీ తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఇది గర్భాశరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో పీరియడ్స్ వల్ల ఇబ్బందులు కలగకుండా తొందరగా అవుతుంది. కడుపు తిమ్మిరి కూడా ఉండదు.
పప్పులు, గింజలు
పప్పులు, గింజల్ని కూడా పీరియడ్స్ కు ముందు తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ వల్ల అలసట రాకుండా చూస్తాయి. అలాగే రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. శరీరంలో శక్తి ఉంటుంది.
ఆకు కూరలు
ఆకు కూరల్ని కూడా పీరియడ్స్ కు ముందు తినాలి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటిని తింటే శరీరంలో మంట ఉండదు. రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఓట్స్
ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీరియడ్స్ కు ముందు ఓట్స్ ను తింటే శరీరం శక్తివంతంగా ఉంటుంది. బలహీనత వచ్చే సమస్య ఉండదు. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి.
జ్యూస్, వాటర్
పీరియడ్స్ టైంలో చాలా మంది నీళ్లను అసలే తాగరు. కానీ దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది పీరియడ్స్ సమస్యలను మరింత పెంచుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా నీళ్లను పుష్కలంగా తాగండి. అలాగే మూలికా టీలు, జ్యూస్ లను కూడా తాగడానికి ప్రయత్నించండి. ఇవి మీకు అలసటను లేకుండా చేస్తాయి. అలాగే ఈ సమయంలో డార్క్ చాక్లెట్, బీట్ రూట్, బచ్చలికూర వంటి ఆహారాలను తిన్నా కూడా మంచిదే. ఇవి కూడా పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.