ముఖానికి శెనగపిండి రాయకూడదా..?
ఈ శెనగపిండిలో మాత్రం.. కొన్ని కలిపి.. అస్సలు ముఖానికి రాయకూడదట. మరి.. శెనగపిండిలో.. అస్సలు కలపకూడనిది ఏంటి..? దాని వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసుకుందాం...
అందంగా కనిపించాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఆ అందంగా కనిపించడం కోసం మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా చేసే ప్రయత్నాల్లో హోం రెమిడీస్ కూడా చాలా ఉంటాయి. హోం రెమిడీస్ లో.. ఎక్కువ మంది ఫాలో అయ్యే చిట్కా.. ముఖానికి శెనగ పిండి అప్లై చేయడం. అమ్మమ్మల నాటి నుంచి ఈ చిట్కా వాడుతూ వస్తున్నాం. కానీ.. శెనగపిండిని ముఖానికి రాయకూడదట. మీరు చదివింది నిజమే. మనం డైరెక్ట్ గా శెనగపిండిని ముఖానికి అప్లై చేయం. దానిలో ఏదో ఒకటి మిక్స్ చేసి మరీ రాస్తూ ఉంటాం. రోజ్ వాటర్, పాలు, పసుపు ఇలా ఏదో ఒకటి కలిపి రాస్తూ ఉంటాం. అప్పుడు.. ఫలితం చాలా పాజిటివ్ గా వస్తుంది. కానీ.. ఈ శెనగపిండిలో మాత్రం.. కొన్ని కలిపి.. అస్సలు ముఖానికి రాయకూడదట. మరి.. శెనగపిండిలో.. అస్సలు కలపకూడనిది ఏంటి..? దాని వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసుకుందాం...
ఎక్కువ మంది కామన్ గా చేసే తప్పు ఇది. చాలా మంది ముఖానికి ముల్తీ మట్టి రాస్తారు. శెనగపిండి కూడా రాస్తారు. అయితే.. ఈ రెండూ కలిపి మాత్రం ముఖానికి అస్సలు రాయకూడదు. ఈ రెండూ కలిపి రాస్తే.. ఫేస్ లో గ్లో పెరుగుతుంది అని మీరు అనుకుంటే... అది పెద్ద పొరపాటు. అందం పెరగడం కాదు... స్కిన్ డ్రైగా మారి, ఇరిటేషన్ రావడానికి కారణం అవుతుంది.
మనం శెనగపిండిని ముఖానికి అప్లై చేయాలి అనుకుంటే.. దాంట్లో పొరపాటున కూడా.. బేకింగ్ సోడా కలపకూడదట. ఈ రెండూ కలిపి ముఖానికి రాయడం వల్ల.. స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందట. తెలీక ఎప్పుడైనా పొరపాటున రాస్తే.. ముఖంపై ర్యాషెస్ రావడం లేదంటే.. మొటిమలు రావడం లాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు.. శెనగపిండిలో.. పొరపాటున కూడా నిమ్మకాయ రసం కలిపి.. ముఖానికి రాయకూడదు. ఫేస్ క్లీన్ చేయడానికి ఎక్కువ మందికి ఈ రెమిడీ ఫాలో అవుతూ ఉంటారు. కానీ... ఈ పొరపాటు కూడా చేయకూడదు. ఎందుకంటే.. మన స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. దాని వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చర్మంపై దురద రావడం, చర్మం మరింత డ్రైగా మారడం లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి, ఆ పొరపాటు చేయకూడదు.
ఆల్కహాల్ ఉండే ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా.. శెనగపిండిలో అస్సలు కలపకూడదు. కలపినా.. అది ముఖానికి రాయకూడదు. ఎందుకంటే... ఆల్కహాల్ కలిపిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల.. మన చర్మంపై ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి. దాని వల్ల చర్మం పొడిగా మారుతుంది.
మరి.. శెనగపిండిలో ఏం కలిపి ముఖానికి రాసుకోవచ్చు అనే సందేహం మీకు ఉందా.. మనం అందాన్ని పెంచుకోవాలి అంటే... పసుపు, రోజ్ వాటర్, పెరుగు, అలోవెరా జెల్ లాంటివి అయితే... కలిపి రాసుకోవచ్చు. ఇది.. చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.