ముక్కు మీద నల్లమచ్చలను ఎలా పోగొట్టాలి?
ఒక వయసు తర్వాత ముక్కుమీద నల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. ఇది చాలా కామన్. అయితే ఈ మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో ముక్కుపై నల్ల మచ్చలను ఇట్టే పోగొట్టొచ్చు. అదెలాగంటే?
చాలా మందికి చిన్న వయసులోనే ముక్కుపై నల్ల మచ్చలు వస్తుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు, ముక్కు చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల ముక్కుపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఫేస్ స్క్రబ్ ను ఉపయోగించి ఈ నల్ల మచ్చలను పోగొట్టొచ్చు. అయితే మార్కెట్ లో మనకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మీరు మీ ముక్కుపై నల్ల మచ్చలను పోగొట్టడానికి ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా శెనగపిండితో చేసిన స్క్రబ్ మీ ముఖాన్ని అందంగా మారుస్తుంది. ఈ ప్యాక్ నల్ల మచ్చలు వెంటనే పోగొడుతుంది. మరి ఈ స్క్రబ్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నల్ల మచ్చలను పోగొట్టే పదార్థాలు
శెనగ పిండి
రోజ్ వాటర్
ముఖానికి శెనగపిండిని అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
శెనగపిండిలో ఉండే లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మ సంక్రమణను నివారించడంలో శెనగపిండి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
శెనగపిండి ముఖంపై ఉన్న రంధ్రాలను డీప్ క్లీనింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోజ్ వాటర్ మన స్కిన్ పీహెచ్ స్థాయిని నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది.
ఇది నల్ల మచ్చలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడి రంధ్రాలు తగ్గుతాయి.
రోజ్ వాటర్ ముఖానికి టోనర్ గా కూడా ఉపయోగపడుతుంది.
Image: Freepik
డార్క్ స్పాట్స్ తొలగించే ఇంటి చిట్కాలు
ఒక గిన్నెలో 2 చెంచాల శెనగపిండి తీసుకుని అందులో 2-3 చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముక్కుపై ఉన్న నల్లటి మచ్చలపై అప్లై చేయండి. తర్వాత చేతులతో తేలికగా మసాజ్ చేయండి. ఇది ఫేస్ స్కిన్ కు మంచి ఫేస్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను ముక్కుకు 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అలాగూ దూది, నీళ్ల సాయంతో ముక్కును క్లీన్ చేయాలి.
ఇలా వారానికి 4 సార్లు చేయాలి. తరచుగా ఇలాచేయడం వల్ల మీ ముఖం అందంగా కనిపిస్తుంది.