కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలి?
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. తలుపులు, కిటికీలకు ఉన్న కర్టెన్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వీటిని వెంట వెంటనే శుభ్రం చేయకపోతే దానిపై మరికలు మొండిగా మారుతాయి. మరి ఈ కర్టెన్లను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కర్టెన్లను దుమ్ము, దూళి ఎక్కువగా పట్టి మురికిగా మారుతాయి. ముందే ఇంట్లో పిల్లలు వీటితో ఆడుకుంటుంటారు. తరచుగా ముట్టుకుంటుంటారు. అలాగే పిల్లలు చేతులకు అంటిని దుమ్మును, దూళిని కూడా కర్టెన్లకు తుడుస్తుంటారు. దీనివల్ల కర్టెన్లు మురికిగా కనిపిస్తాయి. చాలా రోజుల వరకు వీటిని శుభ్రం చేయకపోతే మరకలు మెండిగా మారుతాయి. వీటిని క్లీన్ చేయడం అంత సులువు కాదు. అందుకే కర్టెన్లను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కర్టెన్లు కడగడానికి ముందు ఇలా చేయండి
ఫ్యాబ్రిక్ చెక్ చేయండి: కర్టెన్లను శుభ్రం చేయడానికి ముందు ఎప్పుడూ కూడా కర్టెన్ల ఫ్యాబ్రిక్ ను చెక్ చేయండి. దీని ప్రకారం.. కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలి? ఎలా ఆరబెట్టాలో తెలుసుకోవచ్చు.
హుక్ లను తొలగించండి: కర్టెన్లను శుభ్రం చేయడానికి ముందు కర్టెన్ ల నుంచి అన్ని హుక్ లు, ఫినియల్స్ ను తొలగించండి.
ధూళిని తొలగించండి: ముందుగా కర్టెన్లను నీటిలో నానబెట్టడానికి ముందు వాటిని బాగా కదిలించండి లేదా వాక్యూమ్ క్లీనర్ తో వాటిపై పేరుకుపోయిన ధూళిని తొలగించండి.
ఇంట్లో కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలి?
ముందుగా సింక్ లేదా బాత్ టబ్ ను చల్లని లేదా గోరువెచ్చని నీటితో నింపండి. ఇప్పుడు దీంట్లో తేలికపాటి డిటర్జెంట్ లేదా కర్టెన్ వాషింగ్ ద్రవాన్ని కలపండి. కానీ కఠినమైన డిటర్జెంట్లను ఉపయోగించడం మానుకోండి. ఆ తర్వాత కర్టెన్లను టబ్ లో ముంచి వాటిని 15-30 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత మీ చేతులతో కర్టెన్లను సున్నితంగా రుద్దండి.
సబ్బు అవశేషాలన్నింటినీ తొలగించడానికి చివర్ లో చల్లని నీటితో కర్టెన్లను బాగా కడగండి. ఇప్పుడు కర్టెన్లను గట్టిగా నొక్కడానికి బదులుగ వాటి నుండి నీటిని తొలగించడానికి వాటిని సున్నితంగా నొక్కండి.
ఆ తర్వాత కర్టెన్లను ఆరబెట్టండి.
washing machine
కర్టెన్ శుభ్రం చేయడానికి ఎలాంటి వస్తువులను ఉపయోగించాలి?
కర్టెన్లపై మొండి మరకలను శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్, ఉప్పు లేదా బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు. ఇవి అన్ని సహజంగా శుభ్రపరిచే ఏజెంట్లు. ఇవి మీ కర్టెన్లను తెల్లగా చేయడానికి సహాయపడతాయి. వీటిలో ఒకదాన్ని తీసుకుని వాషింగ్ వాటర్ లో వేయాలి. తర్వాత అందులో కర్టెన్ ను నానబెట్టి చేతులతో రుద్ది క్లీన్ చేయాలి.