పొద్దున్నే నిద్రలేచి వాకిలి ఊడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఆడవాళ్లందరూ ఉదయాన్నే నిద్రలేచి ముందుగా వాకిలినే ఊడుస్తారు. వాకిలిని ఊడవడం వల్ల నీట్ గా కనిపిస్తుంది. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వాకిలిని ఊడవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటంటే?
ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రతపే పాటించడం చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇల్లు, వాకిని సకాలంలో శుభ్రపరిచే ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయడం చాలా శుభప్రదమని శాస్త్రాల్లో చెప్పబడింది. పొద్దున్నే నిద్రలేచి ఊడ్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
సుఖసంతోషాలు కలుగుతాయి.
మనకు సుఖసంతోషాలు కలిగేందుకు ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ కొన్ని పనుల వల్ల కూడా సుఖసంతోషాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. హిందూ గ్రంధాల ప్రకారం.. ఉదయాన్నే లేచి ఇల్లు, వాకిలిని ఊడ్చడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఇది ఇంటికి సంతోషంగా ఉంచుతుంది. ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Vastu tips of broom
లక్ష్మీ దేవి సంతోషంగా ఉంటుంది
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజూ పూజలు చేస్తుంటారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసేవారి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది.
నెగిటివ్ ఎనర్జీని తొలగిపోతుంది
ఉదయం లేవగానే చాలా మంది ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తుంటారు. అయితే ముందు వాకిలిని శుభ్రం చేసుకుంటే నెగెటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి బయటకు వెళ్లి పోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
డబ్బుకు కొదవ ఉండదు.
ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే చీపురు పట్టుకుని వాకిలి, ఇల్లు ఉడవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అమ్మవారి దయ వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవ రానే రాదు.
విజయం
మీరు ఏదైనా పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లనప్పుడు ఎవరైనా ఊడ్చడం చూసినట్టైతే అది మీకు శుభ సంకేతమే అవుతుంది. ఇలా ఊడవడం చూసినప్పుడు మీరు వెళుతున్న పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
పేదరికం పోతుంది.
పొద్దున్నే లేచి ఊడ్చడం వల్ల పేదరికం మీ దరిదాపుల్లో ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుందని నమ్ముతారు. అలాగే ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
గొడవల నుంచి విముక్తి
ఉదయాన్నే లేచి వాకిలి, ఇల్లు ఊడ్చడం వల్ల ఇంట్లోని నెగిటివిటీ పోతుంది. ఇంట్లో గొడవలు, కొట్లాటలు జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇది ఇంటి సభ్యులందరినీ ఒకరినొకరు ప్రేమగా ఉంచుతుంది.