Hair Oil: జుట్టుకు అస్సలు కొబ్బరి నూనె రాయకపోతే ఏమౌతుంది?
జుట్టు అందంగా కనిపించాలి అంటే కచ్చితంగా నూనె రాయాల్సిందే. ఎందుకంటే.. నూనె మన జుట్టుకు మంచి సహజ కండిషనర్ లా పని చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

జుట్టుకు నూనె ఎందుకు రాయాలి?
జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం ఎవరికి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. తరతరాలుగా భారతీయ సౌందర్య సాధనాలలో జుట్టుకు నూనె రాయడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. కానీ, ఈ రోజుల్లో జుట్టుకు నూనె రాసేవారు కూడా తగ్గిపోయారు. తమ అందం తగ్గుతుందనో, లేక తమకు సమయం లేదనో.. ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ కి ఆయిల్ అనేదే రాయడం లేదు. మరి, ఇలా జుట్టుకి నూనె రాయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? అసలు జుట్టుకు నూనె రాయడం అవసరమా? రాయకపోతే ఏమౌతుంది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
1.జుట్టు పొడిబారడం, చిట్లడం..
జుట్టు అందంగా కనిపించాలి అంటే కచ్చితంగా నూనె రాయాల్సిందే. ఎందుకంటే.. నూనె మన జుట్టుకు మంచి సహజ కండిషనర్ లా పని చేస్తుంది. జుట్టును తేమగా మారుస్తుంది. మీరు క్రమం తప్పకుండా నూనె రాయాలి. కానీ, అలా రాయకపోతే.. మీ జుట్టు పొడిబారడం, చిట్లినట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా మీరు హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడితే మరింత ఎక్కువగా హెయిర్ డ్యామేజ్ అవుతుంది.
2.జుట్టు రాలే సమస్యను పెంచుతుంది..
హెయిర్ ఆయిల్ జుట్టు మూలాలను బలపరుస్తుంది.జుట్టు చిట్లిపోవడానికి తగ్గిస్తుంది. మంచి పోషణను కూడా అందిస్తుంది. అదే... మీరు రెగ్యులర్ గా నూనె రాయకపోతే.. పోషణ అందదు. దీని వల్ల విపరీతంగా జుట్టు రాలిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
3.చుండ్రు సమస్యలు..
రెగ్యులర్ గా జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా దురద, చుండ్రు వచ్చే అవకాశం తక్కువ. నూనె మన తలను మంచిగా తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే, మీరు నూనె రాయకపోవడం వల్ల... ఈ దురద, చుండ్రు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
4.జుట్టు కళ తప్పిపోవడం...
రెగ్యులర్ గా జుట్టుకు నూనె రాస్తూ ఉండాలి. అప్పుడే.. హెయిర్ మెరుస్తూ, అందంగా కనపడుతుంది. మంచి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. అలా కాకుండా.. మనం నూనె రాయడం ఆపేస్తే.. జుట్టు నిర్జీవంగా, నిస్తేజంగా కనపడుతుంది. మృదువైన ఆకృతిని కోల్పోతుంది.
5.జుట్టు పెరుగుదల ఆగిపోవడం..
కొబ్బరి నూనె, ఆముదం, బాదం వంటి నూనెలు జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తాయి. జుట్టుకు మంచి పోషకాలు లభిస్తాయి. మీరు మీ జుట్టుకు నూనె రాయకపోతే.. మీ జుట్టుకు మెరుగైన, వేగవంతమైన పెరుగుదలకు మంచి పోషణ లభించకపోవచ్చు. దీని వల్ల జుట్టు మనం కోరుకున్నట్లు పెరగదు. జుట్టుకు సరిగా నూనె రాయకపోతూ.. యూవీ కిరణాలు, కాలుష్యం కారణంగా హెయిర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
6.రక్త ప్రవాహం..
మీ తలకు నూనె రాయడం అంటే జుట్టు ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. అందుకే.. మీ జుట్టు అందంగా కనిపించాలి అంటే... రెగ్యులర్ గా జుట్టుకు నూనె రాయాలి. లేదు కంటే.. కనీసం తలస్నానం చేయడానికి గంట ముందు అయినా నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనపడుతుంది.