Curd For Face: ముఖానికి రోజూ పెరుగు రాస్తే ఏమౌతుంది?
పెరుగును చాలా సమస్యలను తగ్గించడం కోసం వాడి ఉంటారు. ఆఖరికి జుట్టుకి కూడా రాసి ఉంటారు. కానీ.. ఎప్పుడైనా ముఖానికి అప్లై చేశారా? రెగ్యులర్ గా పెరుగును ముఖానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

Curd For face: పెరుగు అత్యంత అద్భుతమైన ఆహారం. పాల నుంచి తయారయ్యే ఈ పెరుగును రోజూ తినడం వల్ల మనకు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని, గట్ హెల్త్ కి సహాయపడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే.. ఇప్పటి వరకు మనం పెరుగు ను కేవలం ఆరోగ్యం కోసమే వాడాం. కానీ ఇదే పెరుగు మన అందం కూడా పెంచుతుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. పెరుగును చాలా సమస్యలను తగ్గించడం కోసం వాడి ఉంటారు. ఆఖరికి జుట్టుకి కూడా రాసి ఉంటారు. కానీ.. ఎప్పుడైనా ముఖానికి అప్లై చేశారా? రెగ్యులర్ గా పెరుగును ముఖానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
పెరుగులో ప్రోబయోటిక్స్ మాత్రమే కాదు కాల్షియం, లాక్టిక్ యాసిడ్, వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి మన ముఖంపై మొటిమలను తరిమికొట్టడంతో పాటు.. సూర్యరశ్మి నుంచి మన చర్మాన్ని కాపాడటంలోనూ సహాయం చేస్తుంది. మెరిసే చర్మం పొందాలంటే రోజూ ఒక స్పూన్ పెరుగు ముఖానికి రాసినా చాలు. అయితే... కేవలం పెరుగు కాకుండా కొన్ని ఇతర పదార్థాలు కలిపి రాయడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.
చర్మాన్ని తేమ చేస్తుంది.
పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు చర్మాన్ని అవి తేమగా ఉంచడానికి, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో మీ చర్మానికి పెరుగును వాడండి, ఎందుకంటే ఇది పొడి చర్మానికి చాలా మంచిది.
చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది
ఇది చర్మపు పిగ్మెంటేషన్ తగ్గించడంలోనూ సహాయం చేస్తుంది. రెగ్యులర్ గా రాయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన ముఖంపై గీతలు, ముడతలు రావడం చాలా సహజం. వాటిని తగ్గించడంలోనూ ఈ పెరుగు సహాయపడుతుంది.
పెరుగు ముఖానికి ఎవరు రాయాలి?
గ్రీకు పెరుగులోని ఆరోగ్యకరమైన కొవ్వులు , ప్రోటీన్లు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. పొడి చర్మం ఉన్నవారు వాడితే వారి చర్మం మృదువుగా మారుతుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారు కూడా పెరుగు నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే దాని లాక్టిక్ ఆమ్లం ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్ గా పనిచేస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. సున్నితమైన వారు కూడా వాడొచ్చు. ఎవరైనా ముఖానికి పెరుగు వాడొచ్చు. అయితే, వాడేముందు కాస్త ప్యాచ్ టెస్టు చేసుకోవడం మాత్రం అవసరం.
చర్మానికి పెరుగు ఎలా రాయాలి?
బాడీ మాస్క్: శరీర విశ్రాంతి కోసం, లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు జోడించి బాడీ మాస్క్‌గా ఉపయోగించండి.
ఫేస్ ప్యాక్: పెరుగుతో కలబంద జెల్ కలిపి ఎండ కారణంగా కమిలిపోయిన, ట్యాన్ అయిన ప్రదేశాలలో అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
కంటి సంరక్షణ: మీ కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించడానికి మీరు పెరుగును అప్లై చేయవచ్చు.
ఎక్స్‌ఫోలియేటింగ్ చికిత్స: పెరుగుకు చక్కెర లేదా ఓట్స్ వేసి ఈ మాస్క్ ముఖానికి రాస్తే.. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ఫేస్ మాస్క్ వాడటం: చర్మాన్ని కాంతివంతం చేయడానికి గ్రీకు పెరుగులో ఒక టీస్పూన్ తేనె , చిటికెడు పసుపు కలపండి.