కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది అబ్బాయిలకు, అమ్మాయిలకు కనుబొమ్మలు కలిసి ఉంటాయి. కానీ ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
ఓషనోగ్రఫీ ప్రకారం.. మన శరీరంలోని చాలా భాగాలను చూసి మన స్వభావం, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. మన కళ్ల రంగును చూసి మన గురించి ఎన్నో విషయాలను, ఎవ్వరికీ తెలియని రహస్యాలను తెలుసుకున్నట్టే.. మన కనుబొమ్మల ఆకారాన్ని బట్టి కూడా మనకున్న మంచి, చెడు అలవాట్ల గురించి మన ప్రవర్తన గురించి పూర్తిగా తెలుసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చాలా మందిక కనుబొమ్మలు అనుసంధానించబడి ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఇవి విడివిడిగా కలవకుండా ఉంటాయి. అసలు కనుబొమ్మలు కలిస్తే ఏం జరుగుతుంది? దీని ఆధారంగా ఒక వ్యక్తి ఎలాంటి వాడో జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎవరికి మంచి? ఎవరికి చెడు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కలుసుకున్న కనుబొమ్మలు ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిష్యం ప్రకారం.. కలిసిన కనుబొమ్మలు పురుషులకు శుభప్రదంగా భావిస్తారు. కానీ ఆడవారికి కలిసిన కనుబొమ్మలు ఉండటం మంచి సంకేతంగా పరిగణించరు. ఇది వారికి చెడు సంకేతంగా భావిస్తారు.
వీరు కష్టపడి పనిచేస్తారు
రెండు కనుబొమ్మలు పెనవేసుకున్న వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరి ఎంతో కష్టపడి తమ లక్ష్యాలను చేరుకుంటారు. కష్టంతోనే దేనినైనా సాధిస్తారు. ఊరికే పనులు పూర్తి కావాలని వీరు ఎప్పుడూ అనుకోరు.
గొడవపడతారు
పురుషుల సంగతి పక్కన పెడితే.. జ్యోతిష్యం ప్రకారం.. రెండు కనుబొమ్మలు కలిసిన ఆడవారు గొడవకు సిద్దంగా ఉంటారు. వీరి జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టకుండా చెడా మడా వాయించేస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. వీరు గొడవ స్వభావం కలిగి ఉంటారని నమ్ముతారు.
వాదోపవాదాలు
కనుబొమ్మలు కలిసిన ఆడవారు ఇతరులతో ఎక్కువగా వాదోపవాదాలకు దిగుతారని నమ్ముతారు. అందుకే వీరికి కలిసిన కనుబొమ్మలు శుభప్రధంగా భావించరు. గొడవ స్వభావం వల్ల వీరికి చాలా మంది దూరంగా ఉండాలనుకుంటారు.
హ్యాపీ లైఫ్ దొరకదు
రెండు కనుబొమ్మలు కలిసిన ఆడవారికి జీవితంలో సుఖం దొరకదని నమ్ముతారు. సముద్ర శాస్త్రం ప్రకారం.. రెండు కనుబొమ్మలు పెనవేసుకున్న ఆడవాళ్లకు కుటుంబ జీవితంలో సుఖం ఉండదట. వీరు ఎప్పుడూ కష్టాలు పడుతుంటారట.
లోపలికి వంగిన కనుబొమ్మలు
ఎవరికైతే కనుబొమ్మలు లోపలికి వంగి ఉంటాయో వారికి ఇతరుల కంటే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వీరి జీవితం స్పెషల్ గా కాకుండా ఇతరుల లాగే మామూలుగా ముందుకు సాగుతుంది. వీరి జీవితంలో వింతలు, విశేషాలు ఏమీ ఉండవు. కనుబొమ్మలు లోపలకు వంగి ఉన్నవారికి జీవితంలో పెద్దగా ఆశయం అంటూ ఏమీ ఉండదు. వీళ్లు సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు.