పెళ్లి తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా?
పెళ్లి తర్వాత ఆడవాళ్లు బాగా బరువు పెరిగిపోతారు. దీన్ని చాలా మంది గుర్తిస్తారు. ఇదొక్కటే కాదు పెళ్లి తర్వాత ఆడవాళ్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అవేంటంటే..
పెళ్లయ్యాక అమ్మాయిల జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక్కసారిగా లైఫ్ ఛేంజ్ కావడంతో చాలా మంది అమ్మాయిలు పెళ్లైన కొత్తలో అత్తవారింటిదగ్గర ఒత్తిడి గురవుతుంటారు. ఇబ్బందిగా ఫీలవుతుంటారు. పెళ్లి తర్వాత అమ్మాయిల ఇల్లు, పనిలో చాలా మార్పులు వస్తాయి. అంతేకాదుపెళ్లైన తర్వాత ఆడవాళ్ల శరీరంలో చాలా చాలా మార్పులు వస్తాయన్న సంగతి మీకు తెలుసా? అసలు పెళ్లి తర్వాత ఆడవాళ్ల శరీరంలో వచ్చే మార్పులేంటో తెలుసుకుందాం పదండి.
రొమ్ము పరిమాణంలో మార్పు
పెళ్లైన తర్వాత దంపతుల మధ్య శృంగారం జరగడం సర్వ సాధారణ విషయం. అయితే దీనివల్ల ఆడవారి శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీనివల్ల మహిళల రొమ్ము పరిమాణంలో మార్పు ఉంటుంది. అయితే కొంతమంది ఆడవాళ్ల రొమ్ముల పరిమాణంలో ఎలాంటి తేడా ఉండదు.
గ్లోయింగ్ స్కిన్
వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఉన్న ఆడవాళ్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. అవును భర్తతో సంతోషంగా ఉన్న ఆడవారి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే రొమాన్స్ కూడా వీరిని మానసికంగా, శారీరకంగా సంతోషపెడుతుంది. దీనివల్ల వారి ముఖంలో వేరే మెరుపు కనిపిస్తుంది.
హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయి
వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న మహిళల శరీరంలో హ్యాపీ హార్మోన్లు పెరగడం ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వివాహానంతరం చాలా మంది మహిళలు సెరోటోనిన్, ఎండోఫ్రిన్స్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తారు.
బరువు పెరుగుతారు
చాలా మంది ఆడవారు పెళ్లి తర్వాత ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో హెవీగా తిని ఫిట్ నెస్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. దీనివల్ల బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనికితోడు రొమాన్స్ పెరగడం వల్ల మహిళల పొట్ట, తొడలు, పిరుదుల కూడా బరువు పెరుగుతాయి.
ముఖంపై మొటిమలు
కొంతమంది ఆడవారు పెళ్లి తర్వాత గర్భం దాల్చకుండా ఉండటానికి జనన నియంత్రణ మాత్రలను ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు విపరీతంగా అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీర దుర్వాసన
పెళ్లైన తర్వాత ఆడవాళ్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు బాగా పెరుగుతాయి. దీనివల్ల వీరి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ దీనివల్ల వీరి శరీర దుర్వాసన కూడా బాగా పెరుగుతుంది.
పెరిగిన ఒత్తిడి
పెళ్లి తర్వాత కొంతమంది మహిళల జీవితంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎందుకంటే కొత్త ఇంట్లో అలవాటు పడలేక, ఇంట్లో వారితో కలిసిపోలేక చాలా ఇబ్బందులు పడతారు. ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా వీళ్లు ఏదైనా పని చేయడానికి ముందు భయపడటం చాలా భయపడిపోతుంటారు.