MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కొబ్బరి నూనెను ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

కొబ్బరి నూనెను ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనకున్న ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కానీ మనలో ప్రతి ఒక్కరూ కొబ్బరి నూనెను జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దీన్ని చర్మానికి కూడా ఉపయోగించొచ్చు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Nov 13 2024, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చలికాలం స్టార్ట్ అయ్యింది. ఇంకేంటి ఈ చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది. అయితే ఈ చలికాలంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఇది చాలా సహజం. అయితే ఈ సీజన్ లో  ఎన్నో రకాల చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి రకరకాల క్రీములను పెడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. 
 

25

చలికాలంలో పాదాల పగుళ్లు, చర్మంలో ముడతలు, పెదాల పగుళ్లు, స్కిన్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించలేకపోవడం వంటి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి చాలా మంది మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వంటి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.

అయినా స్కిన్ అలాగే ఉంటుంది. అయితే ఈ సీజన్ లో మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు చర్మానికి కొబ్బరి నూనెను రాయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

స్కిన్ లైటనింగ్

వానాకాలం, ఎండాకాలం కంటే ఒక్క చలికాలంలోనే మన చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. కానీ ఇలా మన చర్మం పొడిబారినప్పుడు పీలింగ్, పగుళ్లు వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి కొబ్బరి నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఇందుకోసం గ్లిజరిన్ ను కొబ్బరి నూనెలో మిక్స్ చేసి చర్మానికి పెట్టాలి. ఈ గ్లిజరిన్, కొబ్బరి నూనె రెండూ మన చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి. ఇది చలికాలంలో మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. 
 

45


చలికాలంలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే కొబ్బరినూనెను ఖచ్చితంగా ఉపయోగించండి. ఈ సీజన్ లో మీ ముఖం అందంగా ఉండాలంటే కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్, పెసరపప్పుతో ఫేస్ మాస్క్ తయారుచేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత  ముఖాన్ని నీట్ గా కడగండి. ఈ ఫేస్ట్ మాస్క్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది. 

ఒక్క చలికాలంలోనే కాదు వేసవికాలంలో కూడా చర్మంలో తేమ తగ్గుతుంది. దీనివల్ల మీకు ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రమే చర్మం హైడ్రేషన్ కు సహాయపడే బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించండి. చలికాలంలో ముఖాన్ని సబ్బుతో ఎక్కువగా కడగకూడదు. ఎందుకంటే కొన్ని రకాల సబ్బుల్లో కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. 
 

55

అలాగే మీ  చర్మం ఈ సీజన్ లో కూడా తేమగా ఉండాలంటే మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. చాలా మంది చలికాలంలో దాహం ఎక్కువగా కావట్లేదని తాగకుండా ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల బాడీ, చర్మం డీహైడ్రేట్ అయ్యి సమస్యలు వస్తాయి. కాబట్టి నీళ్లను పుష్కలంగా తాగితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. వీటితో పాటుగా మీ చర్మం హెల్తీగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Recommended image2
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image3
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved