Coconut Milk for Hair: కొబ్బరి నూనె కాదు, కొబ్బరి పాలు జుట్టుకు రాస్తే ఏమౌతుంది?
కొబ్బరి నూనె కి బదులు కొబ్బరి పాలు రాస్తే ఏమౌతుంది? అసలు జుట్టుకు కొబ్బరి పాలు రాయోచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కొబ్బరి వల్ల మనకు చాలా పోషకాలు అందుతాయి, కొబ్బరి నూనెను మనం రెగ్యులర్ గా జుట్టుకు వాడుతూ ఉంటాం. అంతెందుకు కొబ్బరి పాలను ఉపయోగించి చాలా రకాల వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటాం. కానీ.. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నూనె కి బదులు కొబ్బరి పాలు రాస్తే ఏమౌతుంది? అసలు జుట్టుకు కొబ్బరి పాలు రాయోచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
hair
మన జుట్టు సంరక్షణలో కొబ్బరి పాలు బాగా సహాయపడతాయి. ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఎమోలియంట లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. జుట్టుకు మంచి తేమను అందిస్తుంది. జుట్టుకు పొడిబారడం సమస్య లేకుండా చేస్తుంది. దీని వల్ల జట్టు ఎప్పుడూ అందంగా కనపడుతుంది. అంతేకాదు.. కొబ్బరి పాలు జుట్టుకు రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనపడేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య ఉండదు. జుట్టు పొడవుగా పెరగడానికి కారణం అవుతుంది.
hair oiling
కొబ్బరి పాలను ఎలా వాడాలి?
మీరు మీ జుట్టుకు పోషణ, తేమను అందించడానికి షాంపూకు ముందు చికిత్సగా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.
దానితో పాటు, తేమను కాపాడటానికి , చివర్లు చీలిపోకుండా ఉండటానికి మీరు మీ జుట్టు చివరలకు కొబ్బరి పాలు రాయాలి.
మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి, మీరు కొబ్బరి పాలను ఆలివ్ నూనె , తేనె వంటి ఇతర సహజ పదార్ధాలతో కలిపి మీ జుట్టుకు అప్లై చేయవచ్చు.వారానికి ఒకసారి ఈ కొబ్బరి పాల హెయిర్ మాస్క్ వాడినా కూడా జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది.