పరగడుపున ఈ డ్రింక్ తాగితే... మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం..!
మార్కెట్లో లభించే కెమికల్స్ తో నిండిన క్రీములు మనకు కొన్నిసార్లు వెంటనే పరిష్కారం చూపించినట్లు అనిపించినా.. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఆ సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటాయి. అందుకే.. చర్మంలో గ్లోని సహజంగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.
అందంగా ఉండాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందం అంటే.. రంగు కాదు... ఫేస్ లో గ్లో ఉండటం. చాలా మంది తమ చర్మాన్ని మెరిసేలా కనిపించేలా చేయడం కోసం ఏవేవో తిప్పలు పడుతూ ఉంటారు. మార్కెట్లో కొత్తగా వచ్చే ఏ క్రీమునీ వదిలిపెట్టరు. కానీ... మార్కెట్లో లభించే కెమికల్స్ తో నిండిన క్రీములు మనకు కొన్నిసార్లు వెంటనే పరిష్కారం చూపించినట్లు అనిపించినా.. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఆ సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటాయి. అందుకే.. చర్మంలో గ్లోని సహజంగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.
సహజంగా అంటే.. ఇంట్లో దొరికే వస్తువులు తెచ్చి ముఖానికి రుద్దేయమని కాదు.. అది కూడా లోపలి నుంచి రావాలి. దాని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పరగడుపున ఒక డ్రింక్ రోజూ తాగడం అలవాటు చేసుకుంటే.. మీ ఫేస్ లో వచ్చే గ్లో మీరే గుర్తించగలరు.
రోజూ ఉదయాన్నే.. మీరు కుంకుమ పువ్వు తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు కాస్త చల్లారిన తర్వాత అంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరిపోతుంది. రెగ్యులర్ గా ఈ డ్రింక్ తాగితే చాలు మీ ఫేస్ లో గ్లో కచ్చితంగా పెరుగుతుంది. లేదంటే... రాత్రిపూట కుంకుమ పువ్వు నానపెట్టి.. ఉదయాన్నే అయినా తాగొచ్చు.
కుంకుమపువ్వులో విటమిన్ సి వంటి మాయా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, అలాగే కలర్ లైట్ కూడా అవుతుంది. ముఖంపై ఏవైనా మచ్చలు ఉన్నా తగ్గిపోతాయి. ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కుంకుమ పువ్వులో ఉన్నాయి.
Saffron tea
కుంకుమపువ్వులో మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కెరోటినాయిడ్లను కలిగి ఉంటుంది, ఇవి సూర్యరశ్మిని రిపేర్ చేయడంతో సహా అనేక విధాలుగా చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
ఇది చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్యకు కూడా ఇది మేలు చేస్తుంది. కుంకుమపువ్వు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నీటిలో రెండు లేదా 3 పోగుల కంటే ఎక్కువ వేయకూడదని నిపుణులు అంటున్నారు.