MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Woman
  • ఫ్రిజ్ లో ఈ కూరగాయల్ని పెట్టొద్దు

ఫ్రిజ్ లో ఈ కూరగాయల్ని పెట్టొద్దు

కూరగాయలు చాలా రోజులు ఫ్రెష్ గా ఉండాలని ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇది చాలా కామన్. కానీ కొన్ని రకాల కూరగాయల్ని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 31 2024, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలమైనా, వానాకాలమైనా, ఎండాకాలమైనా ఫ్రిజ్ ను ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఫ్రిజ్ ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది. చాలా మంది ఫ్రిజ్ లో ఏవి పెట్టినా పెట్టకపోయినా.. కూరగాయల్ని మాత్రం పక్కాగా పెడుతుంటారు. ఎందుకంటే బయట ఉంటే కూరగాయలు తొందరగా పాడవుతాయి. మురిగిపోతాయి.

అదే ఫ్రిజ్ లో పెడితే వారమైనా చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా ఉంటాయి. అందుకే పండ్లను, కూరగాయల్ని ఫ్రిజ్ లో ఖచ్చితంగా పెడుతుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్ లో పెట్టి తింటే ఆరోగ్యం దెబబ్తింటుంది. అందుకే ఏయే కూరగాయల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆకు కూరలు

చలికాలంలో ఆకు కూరల్ని ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ ఆకు కూరలు తొందరగా పాడవుతాయి. అందుకే వీటిని కొనేసి ఫ్రిజ్ లో పెట్టి వారం పాటు వండుకుని తింటుంటారు. కానీ ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పెట్టినా వీటిని శుభ్రంగా కడిగి 12 గంటలు  మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి. ఇంతకంటే ఎక్కువ గంటలు ఉంచితే మాత్రం వాటి సహజ రుచి, ఆకృతి మారుతాయి. అలాగే వీటిలోని పోషకాలు కూడా తగ్గుతాయి. 

36
Garlic in Winter

Garlic in Winter

వెల్లుల్లి, ఉల్లిపాయలు  

వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని కూర ఉండదు. అందుకే ఆడవారు వీటిని ఒకేసారి ఎక్కువ కొనేస్తుంటారు. ఇక ఇవి బయటపెడితే తొందరగా పాడవుతాయని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. అవసరమున్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటుంటారు. కానీ వీటిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రెండూ అంత తొందరగా పాడవవు. నిజమేంటంటే? వీటిని ఫ్రిజ్ లో పెడితే మొలకెత్తడం ప్రారంభిస్తాయి. దీనివల్ల వాటి రుచి మారుతుంది. అందుకే వీటిని ఫ్రిజ్ లో కాకుండా.. చల్లని లేదా పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. 

46

అల్లం

చాలా మంది అల్లాన్ని చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది మన శరీరాన్ని చలికి తట్టుకునేలా చేస్తుంది. అంటే అల్లంలో ఉండే వేడి స్వభావం మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది. నిజానికి ఇది వంటలను టేస్టీగా చేయడమే కాకుండా.. దీనిలో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అయితే కొంతమంది అల్లాన్ని కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అల్లాన్ని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో అల్లాన్ని పెడితే తొందరగా బూజు పడుతుంది. దీనివల్ల అది చెడిపోతుంది. ఇలాంటి అల్లాన్ని తింటే కాలెయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

56

బంగాళాదుంపలు 

ఎండాకాలమైనా, చలికాలమైనా.. కాలంతో సంబంధం లేకుండా ఆలుగడ్డలను తింటుంటారు. చాలా మంది ఆలుగడ్డలను ఒకేసారి ఎక్కువగా కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. ఇంట్లో ఏ కూరగాయలున్నా వాటితో పాటుగా వీటిని కలిపి వండేస్తుంటారు. అయితే బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు కొంతమంది. కానీ ఇలా ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెట్టడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెడితే అవి తొందరగా మొలకెత్తుతాయి. అలాగే వీటిలో ఉండే పిండి పదార్థం కాస్త చక్కెరగా మారుతుంది. వీటిని తింటే మధుమేహుల ఆరోగ్యమే కాకుండా ఇతరుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

66
tomatoes

tomatoes

టమాటాలు 

ఏ కూరగాయ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క ఇంట్లో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ టమాటాలు చాలా తొందరగా మురిగిపోతాయి. పాడైపోతుంటాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీనివల్ల టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ టమాటాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే టమాటాలను ఫ్రిజ్ లో పెడితే వాటి రుచి, ఆకృతి తగ్గుతాయి. అలాగే టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved