MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Coconut oil: రాత్రి పడుకునే ముందు ముఖానికి పెడితే ఏమౌతుంది?

Coconut oil: రాత్రి పడుకునే ముందు ముఖానికి పెడితే ఏమౌతుంది?

కొబ్బరి నూనె మన జుట్టుకు ఎంతటి మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కానీ ఇది మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? అసలు దీన్ని రాత్రిపూట ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 31 2025, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనకు మార్కెట్ లో ఎన్నో రకాల నూనెలు దొరుకుతాయి. కానీ వీటిలో చాలా మంది వాడేది కొబ్బరి నూనెనే. ఇప్పటి నుంచి కాదు.. ఎన్నో ఏండ్ల నుంచి కొబ్బరి నూనెను వాడుతూ వస్తున్నారు. ఎందుకంటే దీనిలో అన్ని ప్రయోజనాలు దాగున్నాయి కాబట్టి. కొబ్బరి నూనెను జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అలాగే మంచి స్మూత్ గా, షైనీగా కూడా ఉంటుంది. అంతేకాదు వెంట్రుకలు హైడ్రేట్ గా, హెల్తీగా ఉంటాయి. అందుకే చాలా మంది కొబ్బరి నూనెనే జుట్టుకు ఎక్కువగా వాడుతారు. అయితే ఇది కేవలం మన జుట్టుకు మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

నిపుణుల ప్రకారం.. కొబ్బరి నూనె మన చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అలాగే ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ముఖానికి కొబ్బరి నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ముఖానికి కొబ్బరి నూనెను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు 

చర్మ సమస్యలను నయమవుతాయి

స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మ సమస్యలను ఫాస్ట్ గా నయం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. దీనివల్ల చలికాలంలో స్కిన్ డల్ నెస్, డ్రై స్కిన్ వంటి సమస్యలు తగ్గుతాయి. 
 

35
skin care

skin care

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది

కొబ్బరి నూనె మన చర్మానికి మంచి పోషణనిస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, ప్రో విటమిన్ ఎ, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. చలికాలపు పొడి నుంచి మన చర్మాన్ని రక్షించడంలో కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. 
 

45

వృద్ధాప్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది

కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. రాత్రిపూట కొబ్బరి నూనెను ముఖానికి పెట్టడం వల్ల సహజంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ చర్మానికి రక్షణగా ఉంటుంది. 
 

55

రాత్రిపూట ముఖానికి కొబ్బరినూనె ఎలా అప్లై చేయాలి?

మీ ముఖ చర్మం నీరసంగా, డ్రై గా ఉంటే.. కొబ్బరి రూనె మీ చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.  ఇందుకోసం కొబ్బరినూనెలో అలోవెరా జెల్, రైస్ వాటర్,  గ్లిజరిన్ మిక్స్ చేసి క్రీమ్ గా తయారుచేయొచ్చు. లేదంటే కొబ్బరి నూనెను మీ ముఖానికి పెట్టి కొద్దిసేపు మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Recommended image2
Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...
Recommended image3
Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved