MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • విటమిన్ ఈ క్యాప్సిల్ లో ఇవి కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

విటమిన్ ఈ క్యాప్సిల్ లో ఇవి కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

చాలా తక్కువ ఖర్చుతో కేవలం మనకు ఈజీగా లభించే విటమిన్ ఈ క్యాప్సిల్ తో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వారం రోజుల్లోనే మీ ముఖంలో మార్పును మీరు స్పష్టంగా చూడగలుగుతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 27 2025, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సహజమైన అందాన్ని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? వయసు పెరుగుతున్నా కూడా అది తమ ముఖంలో కనిపించకూడదు అనే అందరూ కోరుకుంటారు. అయితే... ఆ అందం మేకప్ లు పూస్తే కంటే.. సహజంగా వస్తే బాగుంటుందని చాలా మందిలో ఉంటుంది. దాని కోసం కూడా ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ఉంటారు. అయితే... మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగించి ముఖం కాంతివంతంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మనం ముఖం అందంగా కనిపించాలి అంటే ఖరీదైన క్రీములు, ఆయిల్స్ రాయాలనే  భావన చాలా మందిలో ఉంటుంది. కానీ.. చాలా తక్కువ ఖర్చుతో కేవలం మనకు ఈజీగా లభించే విటమిన్ ఈ క్యాప్సిల్ తో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వారం రోజుల్లోనే మీ ముఖంలో మార్పును మీరు స్పష్టంగా చూడగలుగుతారు.
 

35

విటమిన్ ఈ తో చర్మ సౌందర్యం...
మనకు మెడికల్ షాపుల్లో కూడా ఈజీగా లభించే స్తూ ఉంటాయి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్.  ఇవి మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ముఖంపై ముడతలు తగ్గించడానికి, చర్మంపై గ్లో తీసుకురావడానికి, నల్ల మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అయితే.. డైరెక్ట్ గా విటమిన్ ఈ రాయకుండా.. దానిలో కొన్ని కలపడం వల్ల.. మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 

45

విటమిన్ సితో కలపండి
విటమిన్ సి కి బెస్ట్ సోర్స్ నారింజ రసం. కాబట్టి, నారింజ రసంతో విటమిన్ ఇ నూనెను కలిపి మీ ముఖంపై పూయండి. మీ ముఖం మీద దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచండి . ఆ తర్వాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. అంతే.. మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది. చాలా తేజస్సు కనపడుతుంది.

మాయిశ్చరైజర్ కాంబినేషన్ లో..

చాలా మంది విటమిన్ E ని నేరుగా ముఖానికి పూసుకున్నప్పటికీ, మీరు దానిని మీ రోజువారీ మాయిశ్చరైజర్‌తో కూడా కలపవచ్చు. ఈ విధంగా మీ ముఖానికి విటమిన్ E ని పూయడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దీన్ని సాధారణ క్రీమ్ లాగా మీ ముఖానికి అప్లై చేయవచ్చు.
 

55

మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి విటమిన్ E ని ఎలా ఉపయోగించాలి?
మచ్చలు  తొలగించడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ బాగా ఉపయోగపడతాయి. పిగ్మెంటేషన్ తొలగించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది. 

ఈ చర్మ సమస్యలను వదిలించుకోవడానికి, బొప్పాయి, విటమిన్ E క్యాప్సూల్ , రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా రుబ్బుకోండి.
ఇప్పుడు దానిని మీ ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయండి.
ఈ ప్యాక్ ని మీ ముఖం మీద 15 నిమిషాలు అలాగే ఉంచండి.
అప్పుడు మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. వారం రోజులు రెగ్యులర్ గా రాసినా మీకు స్పష్టమైన రిజల్ట్స్ చూస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Recommended image2
Coin Necklace: ఏ సందర్భానికైనా సూటయ్యే కాసు నక్లెస్ డిజైన్లు..చూసేయండి
Recommended image3
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved