ఈ ట్రిక్స్ తో మీ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు..!
జుట్టురాలే సమస్యను కరివేపాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు సమృద్దిగా ఉంటాయి. కరివేపాకు మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను కంట్రోల్ చేస్తుంది
అందమైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.... ఈ రోజుల్లో అది అంత సులవైన పని కాదనే చెప్పాలి. మనం తీసుకునే కల్తీ ఆహారం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారుతోంది. ఇంకేముంది... జుట్టు కళావిహీనంగా మారిపోయి.. కుప్పలు కుప్పలుగా ఊడిపోతుంది. అయితే.. ఈ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే... మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందట. అదెలాగో ఓసారి చూద్దాం..
hair fall
జుట్టురాలే సమస్యను కరివేపాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు సమృద్దిగా ఉంటాయి. కరివేపాకు మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడం నుండి చుండ్రు, దురద వంటి సమస్యలను కూడా కంట్రోల్ చేస్తుంది. విటమిన్ బి లోపం ఉన్నవారిలో జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. ఆ విటమిన్ ఈ కరివేపాకులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుడా...జుట్టు పొడవుగా పెరగడానికీ.. సిల్కీగా మారడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. దానిని ఎలా ఉపయోగించాలో ఓసారి చూద్దాం...
1.కరివేపాకు, ఉసిరి, మెంతుల మిశ్రమం..
మీరు మీ జుట్టు పొడవును పెంచాలనుకుంటే, ఈ రెమెడీ మీకోసమే! అరకప్పు కరివేపాకు, మెంతి ఆకులు, గింజ తీసేసిన ఒక ఉసిరికాయను గ్రైండర్‌లో వేయండి. పదార్థాలను మెత్తగా పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు తలకు, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. ఒక అరగంట పాటు అలానే ఉంచి.. ఆ తర్వాత... నీటితో కడిగేయాలి. తర్వాత తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే.. జుట్టు పొడవుగా పెరుగుతుంది.
2. కొబ్బరి, కరివేపాకు మిశ్రమం..
తక్కువ మంట మీద పాన్ వేడి చేసి అందులో కొబ్బరి నూనె పోయాలి. దానికి కొన్ని కరివేపాకులను కలపండి. కొంచెం చిటపటలాడనివ్వండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ ని చల్లార్చి, హెయిర్ ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్‌లో కంటెంట్‌లను వడకట్టండి. తరచుగా లేదా కనీసం వారానికి ఒకసారి ఈ నూనెను తలకు పట్టించాలి. హెల్తీ హెయిర్ కోసం చూస్తున్న వారికి ఈ రెమెడీ చాలా బాగుంది. కొబ్బరి నూనె భారతీయ జుట్టుకు బాగా సరిపోతుంది. ఈ నూనెలో మన జుట్టు కు ఉపయోగపడే విటమిన్లు చాలా ఉన్నాయి.
3.ఉల్లిపాయ, కరివేపాకు మిశ్రమం...
ఈ రోజుల్లో 10 మందిలో 7 మంది మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ రెమిడీ ఫాలో అయితే..అధిక జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టు క్యూటికల్‌ను బలపరుస్తుంది. కరివేపాకు మీ జుట్టుకు పోషణను కూడా అందిస్తాయి. 2 పదార్థాలను బ్లెండింగ్ జార్‌లో కలపండి. ఆ తర్వాత మస్లిన్ క్లాత్ ద్వారా ద్రావణాన్ని వడకట్టండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి మీ జుట్టు మూలాలపై అప్లై చేయండి. కడిగే ముందు 30 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత నీటితో కడిగేసి.. ఆ తర్వాత షాంపూ తో తలస్నానం చేయండి.
4.కరివేపాకు, పెరుగు మిశ్రమం..
మీ జుట్టు మెరవాలంటే ఈ రెమిడీ ఫాలో అవ్వండి. పెరుగు జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతేకాకుండా తలలో ఉన్న మృతకణాలను, చుండ్రును సున్నితంగా తొలగించడంలో సహాయపడే హైడ్రేటింగ్ స్కాల్ప్ క్లీన్స్‌గా పనిచేస్తుంది. బ్లెండర్‌లో కొన్ని కరివేపాకు, ఒక కప్పు పెరుగు కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలపై అప్లై చేయండి. ఒక అరగంట తర్వాత.. నీటితో తలను కడిగేసి.. తర్వాత షాంపూ చేయాలి.