కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాస్తే.. ముడతలు మాయం..!
కొబ్బరి నూనెలో ఏది కలిపి.. ముఖానికి ఎలా రాస్తే.. ఆ ముడతలు పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
wrinkles
వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయలు మన ముఖంపై చాలా స్పష్టంగా కనపడతాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. ఆ ముడతలు తగ్గించడానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని యాంటీ ఏజినింగ్ క్రీములు ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ, వాటి వల్ల ఉపయోగం ఉంటుందా అంటే.. అది వంద శాతం రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ.. కొబ్బరి నూనె వాడితే మాత్రం కచ్చితంగా ముఖంపై ముడతలు పోగొట్టొచ్చు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. కానీ.. ఆ కొబ్బరి నూనెలో ఏది కలిపి.. ముఖానికి ఎలా రాస్తే.. ఆ ముడతలు పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
wrinkles
కొబ్బరి నూనెలో తేనె కలిపి రోజూ ముఖానికి రాస్తూ ఉండటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ముఖంపై ముడతలను శాశ్వతంగా తొలిగించవచ్చట. అయితే.. ఇది రాయడానికి కూడా ఒక పద్దతి ఉంది.
ముందుగా… ముఖాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే.. ముఖంపై చేరుకున్న దుమ్ము, దూళి మొత్తం పోవాలంటే కచ్చితంగా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖం మీద తడిపోయేంత వరకు ఆగాలి. ఆ తర్వాత.. ఒక స్పూన్ కొబ్బరి నూనెలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. బాగా స్క్రబ్ చేయాలి. మంచిగా సర్కిల్ ఫామ్ లో రుద్దాలి. ఇప్పుడు దానిని ఆరనివ్వాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు.. అది ఎండిపోయే వరకు ఆగాలి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
wrinkles
ఇదే విధానాన్ని కనీసం వారానికి రెండు, మూడు సార్లు అయినా రిపీట్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. వచ్చిన ముడతలు కూడా తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ వయసు కచ్చితంగా తగ్గుతుంది.
తేనె రాయడం వల్ల… అది మన చర్మానికి సహజంగా హైడ్రేషన్ అందిస్తుంది. డ్రై స్కిన్ సమస్యను తగ్గిస్తుంది. సహజంగా ముఖానికి అందం తీసుకురావడంలో సహాయం చేస్తుంది. ఫలితంగా ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంలో గ్లో తీసుకురావడంతో పాటు.. ముఖంపై ముడతలు తగ్గించడంలో సహాయం చేస్తాయి.
ఇక కొబ్బరి నూనె చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయం చేస్తుంది. దాని వల్ల చర్మం ముడతలు పడటం, సాగడం లాంటివి జరగకుండా ఉంటాయి. స్కిన్ టైట్ గా మారి యవ్వనంగా కనపడతారు. ముడతలు మాత్రమే కాదు.. ఫైన్ లైన్స్ కూడా రాకుండా ఉంటాయి. యవ్వనంగా కనపడతారు.