ఇదొక్కటి రాస్తే.. తలలో మళ్లీ డాండ్రఫ్ రాదు..!
చుండ్రు సమస్యతో బాధపడేవారు మరెందరో. ఖరీదైన షాంపూలు ఎన్ని వాడినా.. అలా పోయినట్లే పోయి.. మళ్లీ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి సమస్యతోనే ఫీలౌతున్నట్లయితే... కేవలం ఒకే ఒక్క రెమిడీ వాడి.. ఈ డాండ్రఫ్ కి శాశ్వతంగా తొలగిపోతుంది.
dandruff
ఈ రోజుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు అని చెప్పొచ్చు. ఒకరికి జుట్టు రాలడమే ప్రాబ్లం అయితే.. మరికొరికి కొత్త జుట్టు పెరగకపోవడం ప్రాబ్లం. ఇవి కాక.. చుండ్రు సమస్యతో బాధపడేవారు మరెందరో. ఖరీదైన షాంపూలు ఎన్ని వాడినా.. అలా పోయినట్లే పోయి.. మళ్లీ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి సమస్యతోనే ఫీలౌతున్నట్లయితే... కేవలం ఒకే ఒక్క రెమిడీ వాడి.. ఈ డాండ్రఫ్ కి శాశ్వతంగా తొలగిపోతుంది. మరి ఆ డ్రింక్ ఏంటో ఓసారి చూద్దాం...
Dandruff free scalp
దాదాపు అందరికీ యాపిల్ సైడర్ వెనిగర్ తెలిసే ఉంటుంది. ఎక్కువగా.. బరువు తగ్గడానికి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇదే యాపిల్ సైడర్ వెనిగర్ మీ జుట్టులోని డాండ్రఫ్ ని పూర్తిగా తొలగిస్తుంది. మరి.. దానిని తలకు ఎలా అప్లై చేయాలో చూద్దాం..
రెండు టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 2 టీస్పూన్ల వాటర్, 4 నుంచి 5 కాటన్ బాల్స్ ఇవి ఉంటే చాలు. మరి.. వీటితో జుట్టుకు ఎలా రాయాలో చూద్దాం..
ముందుగా ఒక గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. అందులోనూ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో కాటన్ బాడల్స్ వేయాలి. వాటితో డిప్ చేసి.. నెమ్మదిగా జుట్టును పాయలుగా తీసుకుంటూ తలకు పట్టించాలి. ఒక 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత.. జుట్టును వాటర్ తో కడిగేసి తర్వాత షాంపూ చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే సరిపోతుంది. అంతే... రెండు వారాల్లో మీ డాండ్రఫ్ మొత్తం పోతుంది. జుట్టు హెల్దీగా కనపడుతుంది.