MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • ముఖంపై ఒక్క వెంట్రుక కూడా లేకుండా చేసే చిట్కాలు ఇవి

ముఖంపై ఒక్క వెంట్రుక కూడా లేకుండా చేసే చిట్కాలు ఇవి

కొంతమంది అమ్మాయిలకు ముఖంపై కూడా వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందాన్ని పాడు చేస్తాయి. అందుకే అమ్మాయిలు ఈ వెంట్రుకలను తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని టిప్స్ తో ముఖంపై ఒక్క వెంట్రుక కూడా లేకుండా చేయొచ్చు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 26 2024, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


నేటి కాలంలో ఆడవాళ్లు చర్మ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో చర్మ చికాకు, దురద,  చర్మం పొడిబారడం వంటి చర్మ సమస్యలు రావడం సర్వ సాధారణమయిపోయాయి. ఈ సమస్యలకు తోడు కొంతమందికి నుదిటిమీద, బుగ్గలు వంటి ప్రదేశాల్లో వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటాయి. దీనివల్ల ఆడవారి ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించడానికి మార్కెట్ లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ చాలా మంది ఆడవారు ముఖంపై వెంట్రుకలను తొలగించేందుకు వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేస్తుంటారు. కానీ వీటివల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది.

ఆడవారి ముఖంపై వెంట్రుకలు పెరగడానికి హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సింపుల్, నేచురల్ హోం రెమెడీస్ తో ఫేషియల్ హెయిర్ ను కంట్రోల్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35


ముఖాన్ని శుభ్రంగా చేయడానికి, అందంగా కనిపించేలా చేయడానికి పసుపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.అంతేకాదు ముఖంపై పెరుగుతున్న అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా పసుపు దివ్య ఔషదంలాగ పనిచేస్తుంది. ఈ పసుపు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా సహాయపడుతుంది. అందుకే ముఖంపై ఉన్న వెంట్రుకలను పోగొట్టడానికి పసుపు ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పసుపు, బొప్పాయి మాస్క్:

ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖ తేమను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా ఈజీ. ఇందుకోసం బొప్పాయిని తొక్క తీసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు కలిపి ఫేస్ కు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి పెట్టాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మృదువుగా చేసి వెంట్రుకలను తొలగిస్తుంది. 
 

45
Facial Hair

Facial Hair

శెనగపిండి, పసుపు మాస్క్:

పసుపు,శెనగపిండి ఫేస్ ప్యాక్ కూడా ముఖంపై ఉన్న రోమాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంి. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి శెనగపిండిలో చిటికెడు పసుపును వేసి కలపండి. అలాగే దీనిలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ గంధం పేస్ట్ ను కూడా వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే  ముఖంపై ఉన్న వెంట్రుకల తొలగిపోతాయి. 

55

పసుపు ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

నేచురల్ గా హెయిర్ రిమూవల్:

పసుపులో జుట్టును సహజంగా తొలగించే లక్షణాలు ఉన్నాయి. దీనని ఎన్నో ఏండ్లుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించినప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనంగా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ఆపేస్తుంది. ఈ విధంగా మీరు పసుపుతో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించొచ్చు. 

మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడం వల్ల కలిగే చర్మం ఎరుపు, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తుంది. ఈ విధంగా మీరు పసుపుతో మీ చర్మాన్ని మెరిసేలా చేయొచ్చు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved