పుచ్చగింజలతో జుట్టు పెరుగుతుందా..? బెస్ట్ హోం రెమిడీ ఇది
ఆ గింజలతో మనం ఒత్తైన జుట్టును కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే,.. దాని కోసం మనం ఏం చేయాలి..? పుచ్చగింజలను ఎలా వాడితే.. మన జుట్టు ఒత్తుగా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
watermelon seeds
ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. వాటర్ మెలన్ లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అన్నీ కలగలిపి ఉంటాయి. మనం అందరం పుచ్చకాయ తింటూ.. దానిలోని గింజలను మాత్రం పారేస్తూ ఉంటాం. కానీ.. ఈసారి నుంచి ఆ గింజలను పారేయకండి. ఎందుకంటే ఆ గింజలతో మనం ఒత్తైన జుట్టును కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే,.. దాని కోసం మనం ఏం చేయాలి..? పుచ్చగింజలను ఎలా వాడితే.. మన జుట్టు ఒత్తుగా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
seed
పుచ్చగింజలతో తయారు చేసిన నూనెని జుట్టుకు అప్లై చేయడం వల్ల మన జుట్టు హైడ్రేటెడ్ గా మారుతుంది. అందుకే.. ఆ పుచ్చ నూనెను హెయిర్ మాస్క్ గా వాడటం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలను తగ్గించవచ్చు. జుట్టును స్మూత్ గా మారుస్తుంది. జుట్టును సహజంగా మెరిసేలా చేస్తుంది. ఇప్పుడు ఆ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1.వాటర్ మెలన్, పెరుగు హెయిర్ మాస్క్..
ముందుగా.. కొన్ని ముక్కల పుచ్చ ముక్కలు తీసుకోవాలి. ఒక స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పుచ్చ గింజల నూనె ఉంటే సరిపోతుంది.
పుచ్చముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో పుచ్చ గింజల నూనె వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోనే... పెరుగు కూడా వేసి.. పేస్టులాగా తయారు చేయాలి. ఇప్పుడు ఈ పేస్టును జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. కుదుళ్లకు బాగా పట్టేలా అప్లై చేయాలి ఒక అరగంట పాటు అలానే వదిలేసి.. ఆ తర్వాత.. నీళ్లతో కడిగేసి, షాంపూ చేస్తే సరిపోతుంది. దీనిని.. నెలకు రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరిగుతుంది.
2.వాటర్ మెలన్ సీడ్ హాట్ ఆయిల్ మాస్క్..
మీ జుట్టు పొడవును బట్టి కొన్ని టేబుల్ స్పూన్ల పుచ్చకాయ సీడ్ ఆయిల్.
ముందుగా మీ జుట్టు కడగండి. మైక్రోవేవ్‌లో రెండు టీస్పూన్ల పుచ్చకాయ సీడ్ ఆయిల్ వేడి చేయండి. .గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయండి మరియు కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచండి. 15 నుండి 20 నిమిషాల తర్వాత మీ జుట్టు నుండి నూనెను కడిగి, ఆపై మీకు ఇష్టమైన కండీషనర్‌ను వర్తించండి.
hair mask
3. పుచ్చకాయ గింజల నూనె, తేనె , కలబంద హెయిర్ మాస్క్
1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్
1 టేబుల్ స్పూన్ తేనె
పుచ్చకాయ సీడ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు
హెల్తీ హెయిర్ మాస్క్‌ను రూపొందించడానికి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ తేనె , 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ సీడ్ ఆయిల్ కలపండి.
ఈ మిశ్రమాన్ని మీ జుట్టు,తలకు అప్లై చేసిన తర్వాత, 30 నుండి 60 నిమిషాల తర్వాత కడిగేస్తే సిల్కీ , నిగనిగలాడే జుట్టు వస్తుంది. తరచూ ఈ హెయిర్ మాస్క్ లను వాడటం వల్ల... మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా ఆగిపోతుంది.