హెన్నాలో ఏం కలిపి, ఎప్పుడు పెట్టుకోవాలో తెలుసా?
జుట్టుకు హెన్నాను వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ చలికాలంలో ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటే మాత్రం జలుబు చేస్తుంది. కాబట్టి చలికాలంలో జుట్టు హెన్నాను ఏ టైంలో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ మధ్య కాదు.. జుట్టుకు హెన్నాను ఎన్నో ఏండ్ల నుంచి వాడుతున్నారు. ఇది మన జుట్టుకు సహజ రంగును ఇస్తుంది. అంతేకాదు జుట్టును బలంగా, హెల్తీగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే నేటికీ ఎంతో మంది హెన్నాను వాడుతుంటారు. అయితే హెన్నాలో చలువ చేసే గుణాలుంటాయి.
కాబట్టి చలికాలంలో దీన్ని వాడితే దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీనికి భయపడే చాలా మంది చలికాలంలో హెన్నాను ఉపయోగించకుండా ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో హెన్నాను పెడితే మీకు ఎలాంటి సమస్యలు రావు. అందుకే చలికాలంలో జుట్టుకు గోరింటాకును ఎప్పుడు పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హెన్నాలో ఏం కలిపి జుట్టుకు వాడాలి?
గోరింటాకులో కూలింగ్ లక్షణాలుంటాయి. దీనివల్ల మీకు జలుబు, జ్వరం, తలనొప్పి రాకూడదంటే మాత్రం దీనిలో వేడి స్వభావాన్ని కలిగి ఉన్న పదార్థాలను కలపాలని నిపుణులు చెబుతున్నారు. ఇది గోరింటాకు కూలింగ్ లక్షణాలను తగ్గించడమే కాకుండా.. మీ జుట్టుకు ఎక్కువ పోషణను కూడా అందిస్తుంది.
అందుకే హెన్నాలో చిటికెడు లవంగాల పొడిని కలపండి. అలాగే దీనిలో మీరు ఒక టీస్పూన్ ఆవనూనెను కూడా కలపొచ్చు. ఎందుకంటే ఆవనూనె నెత్తిని వేడెక్కించి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
ఇది కాకుండా.. హెన్నాను తలకు పెట్టుకునే ముందు దానిలో కొంచెం కర్పూరం పౌడర్ ను కూడా కలపొచ్చు. అయితే ఈ మూడు పదార్థాలను విడివిడిగానే ఉపయోగించాలి. ఈ మూడింటిని ఒకేసారి కలిపి వాడకూడదు.
హెన్నాను ఎప్పుడు పెట్టుకుంటే మంచిది?
చలికాలంలో హెన్నా వల్ల మీకు జలుబు చేయకూడదంటే మాత్రం ఖచ్చితంగా ఒక సమయాన్ని పాటించాలి. చలికాలంలో సరైన సమయంలో హెన్నాను జుట్టుకు పెట్టుకుంటే చల్లగా అనిపించదు. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు. అందుకే చలికాలంలో జుట్టుకు హెన్నాను ఉదయం కాకుండా.. మధ్యాహ్నం పెట్టుకోండి.
ఎందుకంటే ఈ టైంలో సూర్యరశ్మి ఉంటుంది. దీనివల్ల జుట్టుకు హెన్నా సులువుగా ఎండిపోతుంది. అలాగే హెన్నాను పెట్టేటప్పుడు మీరు గోరువెచ్చని ప్రదేశంలో ఉండండి. చల్లటి గాలి రాకుండా ఇంటి కిటికీలు,తలుపులను మూయండి. అలాగే హెన్నాను తలకు పట్టించడానికి గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి.
హెన్నా పెట్టిన తర్వాత ఏం చేయాలి?
జుట్టుకు హెన్నాను పెట్టే టైంలో లేదా పెట్టిన తర్వాత చలి పెట్టుకుండా ఉండటానికి మీరు వెచ్చని దుస్తును వేసుకోండి. ఎందుకంటే మీకు జలుబు కాకుండా రక్షిప్తుంది. అలాగే హెన్నా జుట్టుకు అప్లై చేసిన తర్వాత ఉపశమనం కలిగిస్తుంది. హెన్నా పెట్టుకున్న తర్వాత గోరువెచ్చని గుడ్డ లేదా టోపీతో తలను కవర్ చేయండి. ఇది జలుబు రాకుండా కాపాడుతుంది.
హెన్నాను క్లీన్ చేయడానికి గోరు వెచ్చని నీళ్లు
జుట్టుకు హెన్నాను పెట్టడం, తలను వాష్ చేయడానికి మీరు సరైన పద్దతిని ఫాలో అయితే మాత్రం మీకు దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి రాకుండా ఉంటాయి. అయితే హెన్నాను క్లీన్ చేయడానికి మీరు చల్ల నీళ్లను కాకుండా గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. చల్లనీళ్లు వాడితే మాత్రం మీకు పక్కాగా జలుబు చేస్తుంది. అలాగే జుట్టును వాష్ చేయడానికి తేలికపాటి షాంపూను ఉపయోగించండి. ఇది గోరింటాకు సహజ రంగును సులభంగా తొలగిస్తుంది. అయితే గోరువెచ్చని నీళ్లతోనే షాంపూను వాడాలి.
హెన్నాను ఎక్కువగా వాడకూడదు
చలికాలంలో జుట్టుకు హెన్నాను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది తలను చల్లగా ఉంచుతుంది. అందుకే అవసరమైనంత మాత్రమే వాడండి. అలాగే గోరింటాకును 1-2 గంటలకు మించి జుట్టుకు ఉంచుకోకూడదు. నెత్తికి హెన్నాను ఎక్కువ సేపు ఉంచితే మీకు జలుబు చేస్తుంది. జలుబు వల్ల జ్వరం కూడా వస్తుంది. అందుకే చలికాలంలో గోరింటాకును నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వాడాలి. హెన్నాను పదేపదే వాడితే జుట్టు, నెత్తిమీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.