2024 లో మహిళలు కచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ స్టైల్స్ ఇవి..!
ప్రతి ఒక్కరూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో మెరిసిపోవాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి జాబితాలో మీరు కూడా ఉంటే.. ఈ కింది హెయిర్ స్టైల్స్ ని ప్రయత్నించవచ్చు. చూడటానికి అందంగా ఉండటంతోపాటు.. వేసుకోవడం కూడా సులభంగా ఉంటాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ఎవరి అందాన్ని అయినా రెట్టింపు చేయడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. అలా మనకు అంత అందాన్ని ఇస్తున్న జట్టును.. రకరకాల మోడల్స్ లో అలకరించుకోవడం వల్ల.. మనం మరింత రెట్టింపు అందంతో మెరిసిపోవచ్చు. ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిళ్లు లాంటి సందర్భంలో పెళ్లి కూతురు నుంచి.. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో మెరిసిపోవాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి జాబితాలో మీరు కూడా ఉంటే.. ఈ కింది హెయిర్ స్టైల్స్ ని ప్రయత్నించవచ్చు. చూడటానికి అందంగా ఉండటంతోపాటు.. వేసుకోవడం కూడా సులభంగా ఉంటాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..
1.పరాండా బ్రెయిడ్..
మన దగ్గర మంచి యాక్ససరీస్ ఉంటే.. ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం చాలా సులువు. ఇదేమీ కొత్త మోడల్ అని చెప్పలేం. ఒకప్పుడు జడ గంటలు అని పిలచేవారు. అయితే.. వాటి షేప్ మార్చి.. డిఫరెంట్ మోడల్స్ లో మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని జడ పై నుంచి కింద వరకు సమానంగా అల్లుకొని, కింద కుచ్చుల్లాగా వదిలేయాలి.
2.మాతా పట్టీ..
2023లో బాగా ట్రెండ్ అయిన హెయిర్ స్టైల్ లో ఇది ఒకటి. మాతా పట్టీ అంటే.. తలకు పైన పెట్టి.. హెయిర్ స్టైల్ వేస్తారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా నుంచి చాలా మంది తమ పెళ్లికి ఈ హెయిర్ స్టైల్ ఫాలో అవ్వడం విశేషం.
3.జరీ ఫ్రెంచ్ బ్రెయిడ్..
నార్మల్ ఫ్రెంచ్ బ్రెయిడ్ అందరికీ తెలుసు. కానీ.. ఇది జరీ ఫ్రెంచ్ బ్రెయిడ్. చూడటానికి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ, వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
4.ట్విస్టెడ్ బన్..
చాలా కాలంగా నార్మల్ బన్ అందరూ వేసుకుంటూ వస్తున్నారు. కానీ, అది బోరింగ్ గా మారింది. కాబట్టి.. నార్మల్ బన్ కాకుండా.. ట్విస్టెడ్ బన్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ట్విస్టెడ్ బన్ మీ కంప్లీట్ లుక్ ని మార్చేస్తుంది.
5.పిన్నిడ్ బ్యాక్ హెయిర్ స్టైల్..
వెనక నుంచి సింపుల్ గా చిన్నగా పిన్ చేయాలి. ఆ తర్వాత.. వెనక నుంచి జుట్టును చాలా లూస్ గా వదిలేయాలి. ఆ జుట్టును కాస్త వంకర్లు తిరిగేలా కర్ల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. చూడగానే లుక్ అదిరిపోతుంది. హెయిర్ యాక్ససరీస్ తో ఆ అందాన్ని మరింత రెట్టింపు చేయవచ్చు.