Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman
  • అమ్మాయిలు హీల్స్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..!

అమ్మాయిలు హీల్స్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..!

అప్పుడు సరిపోయినట్లే ఉంటాయి.. రాత్రికి ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. అలా కాకుండా.. రాత్రి పూట సెలక్ట్ చేసుకుంటే.. ఈ సమస్య ఉండదు. 

Ramya Sridhar | Published : Feb 12 2024, 01:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Heels

Heels

ఫ్యాషన్ గా ఉండాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? ముఖ్యంగా  అమ్మాయిలు తాము వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే చాలా మంది అమ్మాయిలు హీల్స్ ధరిస్తూ ఉంటారు. అయితే.. హీల్స్ కొనేముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణులు  చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

25
heels

heels

దాదాపు మనం చెప్పులు కొనటేప్పుడు మన సైజ్ ఆధారంగా కొంటూ ఉంటాం. కానీ.. అన్ని రకాల చెప్పులకు సైజ్ ఒకేలా ఉండదు. అంటే.. కంపెనీని బట్టి సైజ్ మారుతూ ఉంటుంది. దానిని బట్టి హీల్స్ ని ఎంచుకోవాలి. అంతేకాకుండా.. ఆ హీల్స్ లుక్ ఎలా ఉంది అనేదాని కంటే.. మీ కాళ్లకు వేసుకున్నప్పుడు మీకు కంఫర్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. హై హీల్స్ చక్కగా సరిపోయేలా ఉండాలి  పాదాలను పట్టుకొని ఉండేలా ఉండాలి. అంతేకానీ.. వదులుగా ఉండేలా చూసుకోవద్దు. కొంచెం వదలుగా ఉన్నా..  మడమలు మీ పాదం పైకి క్రిందికి జారడానికి దారితీయవచ్చు, దీని వల్ల కంట్రోల్ తప్పి కిందపడిపోతూ ఉంటారు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. 

35
heels

heels


మీరు హీల్స్ కొనాలి అనుకుంటే.. ఆరోజు సాయంత్రం కానీ, రాత్రిపూట కానీ షాపింగ్ కి వెళ్లాలి. అదేంటి అని మీరు ఆశ్చర్యపోయినా అదే నిజం.ఇది మీకు అసాధారణంగా అనిపించవచ్చు, కానీ మీ పాదాలు అన్ని రోజువారీ కార్యకలాపాల నుండి అలసిపోయి, వాపుకు గురయ్యే అవకాశం ఉంది. ఉదయం పూట కొనుగోలు చేస్తే.. అప్పుడు సరిపోయినట్లే ఉంటాయి.. రాత్రికి ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. అలా కాకుండా.. రాత్రి పూట సెలక్ట్ చేసుకుంటే.. ఈ సమస్య ఉండదు. 

45
high heels

high heels


ఇక చాలా మంది హీల్స్ వేసుకొని చూసి.. తమ పాదాలకు బాగున్నాయని వెంటనే కొంటూ ఉంటారు. కానీ.. హీల్స్ వేసుకున్న తర్వాత కనీసం కొద్ది దూరం నడిచి చూడాలి. నడవకుండా అస్సలు కొనుక్కోకూడదు. కనీసం 5 నిమిషాల పాటు దుకాణంలో నడవండి. ఎలా నడిచినా మీకు ఇబ్బందిగా లేదు అనిపించినప్పుడే వాటిని కొనాలి. ఏ మాత్ర అసౌకర్యంగా ఉన్నా. వాటిని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

55
high heels

high heels

మీరు హై హీల్స్‌ను ఎంచుకున్నప్పుడు, ఎల్లప్పుడూ హీల్స్ ప్లేస్‌మెంట్ కోసం చూడండి. మడమ మందంగా ఉంటే, అది మీ శరీరానికి ఎక్కువ మద్దతునిస్తుందని గుర్తుంచుకోండి.  మడమ చుట్టూ మాత్రమే దృష్టి కేంద్రీకరించే బదులు మీ బరువును మొత్తం పాదం అంతటా సమానంగా పంపిణీ చేసే ప్లాట్‌ఫారమ్‌ల కోసం చూడండి. అలా కాకుండా.. మడమ దగ్గర మాత్రమే ఎత్తుగా ఉండే హీల్స్ వల్ల.. కాలు బెనికే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories